Corona Variants: ఒకే వ్యక్తి.. ఒకేసారి రెండు వేరియంట్లు.. దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు..

Corona Variants: ఓ పక్క థర్డ్ వేవ్ టెన్షన్ మొదలవుతుంటే.. మరోపక్క పుట్టుకొస్తున్న కరోనా కొత్త రకాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

Corona Variants: ఒకే వ్యక్తి.. ఒకేసారి రెండు వేరియంట్లు.. దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు..
Corona
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 20, 2021 | 12:26 PM

ఓ పక్క థర్డ్ వేవ్ టెన్షన్ మొదలవుతుంటే.. మరోపక్క పుట్టుకొస్తున్న కరోనా కొత్త రకాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అస్సాంకు చెందిన ఓ మహిళా వైద్యురాలికి ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీనిని దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసుగా వైద్య నిపుణులు అంచనాకు వచ్చారు. ఇక డబుల్ ఇన్ఫెక్షన్‌పై ఐసీఎంఆర్‌ అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు.

”అస్సాంలోని మహిళా వైద్యురాలు ఒకేసారి రెండు వేరియంట్ల బారినపడ్డారు. ఆమె నమూనాలు ల్యాబ్‌లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లుగా గుర్తించాం. డబుల్ ఇన్ఫెక్షన్‌పై స్పష్టత రావాలని ఉద్దేశంతో.. శాంపిల్స్‌ను మరోసారి పరీక్షించగా.. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధారించుకున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అలాగే ఆమె కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు కూడా వేయించుకున్నారు. అటు ఆమె భర్త మొదట ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు. తద్వారా ఈమెకు కరోనా సోకింది” అని ఐసీఎంఆర్ అధికారి విశ్వజ్యోతి బొర్కాకొటి తెలిపారు.

కాగా, ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్దురాలికి డబుల్ ఇన్ఫెక్షన్‌కు గురైన విషయం విదితమే. ఆమెకు ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకినట్లు గుర్తించారు. చికిత్స సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో మృతి చెందారు.

Also Read

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

37 నిమిషాల బ్యాటింగ్.. 453 స్ట్రైక్ రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.!

ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. టాలీవుడ్‌ను ఏలుతోంది.. ఈమెవరో గుర్తుపట్టారా!