Covid-19 Vaccine Mixing: డీసీజీఐ కీలక నిర్ణయం.. కోవిషీల్డ్‌ – కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల మిక్సింగ్‌ ట్రయల్స్‌‌కు అనుమతి..

Covaxin - Covishield vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మురంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంకా కొన్ని వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగుతున్న

Covid-19 Vaccine Mixing: డీసీజీఐ కీలక నిర్ణయం.. కోవిషీల్డ్‌ - కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల మిక్సింగ్‌ ట్రయల్స్‌‌కు అనుమతి..
Covid-19 Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 11, 2021 | 11:37 AM

Covaxin – Covishield vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మురంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంకా కొన్ని వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా.. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకాల మిక్సింగ్‌కు సంబంధించిన అధ్యయనానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ల మిక్సింగ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ సూచనల మేరకు డీసీజీఐ.. ప్రయోగాలకు బుధవారం అనుమతిచ్చింది.

అయితే.. వ్యాక్సిన్ మిక్సిగ్ ప్రయోగాలను త‌మిళ‌నాడులోని వెల్లూర్ కాలేజీలో చేపట్టనున్నట్లు నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్డర్ వీకే పాల్ తెలిపారు. ఈ మేరకు పాల్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. సుమారు 300 మంది వలంటీర్లపై వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై స్టడీ చేప‌ట్టాల‌ని జూలై 29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సూచించినట్లు పేర్కొన్నారు. అయితే మిక్సింగ్‌పై గ‌తంలో ఐసీఎంఆర్ చేసిన స్టడీకి ఇది భిన్నంగా ఉండనున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కాగా.. ఇప్పటికే యూపీలో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై స్టడీ చేశారు. తొలి డోసు రూపంలో కోవిషీల్డ్‌ ఇవ్వగా.. మ‌రో ఆరు వారాల తర్వాత రెండ‌వ డోసుగా కోవాగ్జిన్ ఇచ్చారు. ఈ విధంగా18 మంది వలంటీర్లకు మిశ్రమ వ్యాక్సిన్లు ఇవ్వగా.. ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. అయితే ఈ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై మ‌రింత లోతుగా ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. తాజాగా.. నిపుణుల క‌మిటీ సూచనల మేరకు వెల్లూర్ మెడిక‌ల్ కాలేజీలో మ‌రోసారి ట్రయల్స్ జరగనున్నాయి. దీంతో ఈ ట్రయల్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:

Covid-19 second wave: ఆక్సిజన్‌ కొరతతో మరణించింది ఒక్కరే.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Coronavirus India: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో..