Covid-19 second wave: ఆక్సిజన్ కొరతతో మరణించింది ఒక్కరే.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
Oxygen shortage in india: కరోనా సెకండ్ వేవ్‌లో వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, బెడ్లు, మందుల కొరతతో పలువురు మృత్యువాత
Oxygen shortage in india: కరోనా సెకండ్ వేవ్‌లో వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, బెడ్లు, మందుల కొరతతో పలువురు మృత్యువాత పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే..దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం కేవలం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు మరణించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఆ రాష్ట్రం పేరును ఆయన బహిర్గతం చేయలేదు. మిగిలిన రాష్ట్రాలేవీ అలాంటి మరణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదంటూ లవ్ అగర్వాల్ వెల్లడించారు. కాగా.. అంతకుముందు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించిన మరణాల అంశాన్ని పార్లమెంటులో సభ్యులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని రాష్ట్రాలను కోరినట్టు లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం కేవలం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్ కొరత కారణంగా మరణం సంభవించినట్లు పేర్కొన్నారు.
కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి వివరాలను ఈ నెల 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అయితే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు 13 రాష్ట్రాలు వివరాలను సమర్పించినట్టు సమాచారం. ఆ వివరాల ప్రకారం.. ఆక్సిజన్ కొరత కారణంగా పంజాబ్‌లో పలువురు కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారని అనుమానిస్తున్నట్ల తెలిసింది. అయితే ఆక్సిజన్ కొరతతో దేశంలో ఎలాంటి మరణాలూ చోటుచేసుకోలేదంటూ ఇటీవల పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. ఈ విషయంపై రాష్ట్రాలు తమకు వివరాలేవీ సమర్పించలేదని పేర్కొంది.
కాగా.. కేంద్రం ప్రకటన పలు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోయారని.. వారి వివరాలను వెల్లడించడంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అత్యవసర వినియోగం కింద ఆక్సిజన్‌ను ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read: