గుడ్‌న్యూస్.. కరోనా వైరస్‌కు విరుగుడు దొరికింది.. కనుగొన్నది మనోడే..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి విరుగుడు మందులేకపోవడంతో.. ఇప్పటికే వందల మంది ప్రాణాలు గాల్లోకలిశాయి. ఈ వైరస్ ఎటాక్ చేసిన అనంతరం.. మనిషి కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నాడు. దీంతో ఈ వైరస్ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. అయితే ఈ వైరస్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే ఆస్ట్రేలియా బృందం చేపడుతున్న పరిశోధనలు కాస్త సత్పలితాలనిస్తున్నాయి. ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ వాసన్ […]

గుడ్‌న్యూస్.. కరోనా వైరస్‌కు విరుగుడు దొరికింది.. కనుగొన్నది మనోడే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 08, 2020 | 8:21 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి విరుగుడు మందులేకపోవడంతో.. ఇప్పటికే వందల మంది ప్రాణాలు గాల్లోకలిశాయి. ఈ వైరస్ ఎటాక్ చేసిన అనంతరం.. మనిషి కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నాడు. దీంతో ఈ వైరస్ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. అయితే ఈ వైరస్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే ఆస్ట్రేలియా బృందం చేపడుతున్న పరిశోధనలు కాస్త సత్పలితాలనిస్తున్నాయి. ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ వాసన్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్‌ని వేరు చేయడంతో పాటు.. వైరస్ పెరుగుదలను వైద్యులు గుర్తించారు. వైరస్ వ్యాక్సిన్‌ను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ భయంకరమైన కరోనా మహమ్మారికి విరుగుడు త్వరలో లభిస్తుందన్న ఆశ సర్వ్రతా నెలకొంది.