పుర్రెకో బుద్ధి.. పోలీసులు పెట్టారు గడ్డి!

పైత్యప్రకోపం లెవల్‌ దాటితే ఇదిగో ఇలాంటి బుద్ధులే పుడతాయి. ముంబైలో ఓ ఖతర్నాక్‌ ఖిలాడీ ఉన్నాడు. వాడేం చేస్తాడయ్యా అంటే… ముంబైలోని పతుంగా రైల్వేస్టేషన్‌ బ్రిడ్జ్‌పై ఒంటరిగా వెళుతున్న మహిళలను వెనక నుంచి వెళ్లి గాట్టిగా కౌగిలించేసుకుంటాడు. ఆ తరువాత ముద్దు పెడతాడు. వాళ్లు ఎదురుతిరిగేలోపు ఉడాయిస్తాడు. వాడికి అదో సరదా… కొన్ని రోజులుగా వీడికి ఇదే పని! మొన్న జనవరి 25న సీసీటీవీలు చూసిన పోలీసులకు వీడి నిర్వాకం కనిపించింది. తెల్లటి షర్ట్‌.. బ్లూ జీన్స్‌ […]

పుర్రెకో బుద్ధి.. పోలీసులు పెట్టారు గడ్డి!

పైత్యప్రకోపం లెవల్‌ దాటితే ఇదిగో ఇలాంటి బుద్ధులే పుడతాయి. ముంబైలో ఓ ఖతర్నాక్‌ ఖిలాడీ ఉన్నాడు. వాడేం చేస్తాడయ్యా అంటే… ముంబైలోని పతుంగా రైల్వేస్టేషన్‌ బ్రిడ్జ్‌పై ఒంటరిగా వెళుతున్న మహిళలను వెనక నుంచి వెళ్లి గాట్టిగా కౌగిలించేసుకుంటాడు. ఆ తరువాత ముద్దు పెడతాడు. వాళ్లు ఎదురుతిరిగేలోపు ఉడాయిస్తాడు. వాడికి అదో సరదా… కొన్ని రోజులుగా వీడికి ఇదే పని! మొన్న జనవరి 25న సీసీటీవీలు చూసిన పోలీసులకు వీడి నిర్వాకం కనిపించింది. తెల్లటి షర్ట్‌.. బ్లూ జీన్స్‌ పాంట్‌ వేసుకున్న ఇతడు ఓ యువతి దగ్గరకు వెళ్లి వెనక నుంచి ముద్దు పెట్టుకోవడాన్ని గమనించారు. మొన్న ఏదో దొంగతనం కేసులో ఇతడు పోలీసులకు దొరికాడు. నాలుగు తగిలించే సరికి పతుంగా రైల్వేస్టేషన్ బ్రిడ్జ్‌పై అసహ్యపు పనులు చేస్తున్నవాడిని తానేనని ఒప్పుకున్నాడు. గమ్మత్తేమిటంటే ఇప్పటి వరకు తమను వేధించాడని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లయింట్‌ చేయవచ్చని పోలీసులు రిక్వెస్ట్‌ చేస్తున్నా.. ఎవరూ ముందుకు రావడం లేదు.. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా న్యాయపరంగా తాము చేయాల్సినవి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu