గోవా వెళ్లే మందుబాబులకు సర్కార్ భారీ షాక్.. ఇక నుంచి…

గోవా.. పేరు చెబితే చాలు.. మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ చాలా చీప్. అంతేకాదు.. అటు బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ.. పూర్తిగా విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్న ఆశతో.. గోవా టూర్ అంటే.. అంతా రెడీ అంటారు. అయితే ఇప్పుడు అక్కడి గోవా సర్కార్ మందుబాబులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇక గోవాకి వెళ్లి మందు తాగుతూ ఎంజాయి చేద్దామనుకునే వారు.. ఇంతకు ముందులా ఎంజాయ్ చెయ్యలేరు. ఎందుకంటే.. ఇప్పటి వరకు […]

గోవా వెళ్లే మందుబాబులకు సర్కార్ భారీ షాక్.. ఇక నుంచి...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 08, 2020 | 8:23 AM

గోవా.. పేరు చెబితే చాలు.. మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ చాలా చీప్. అంతేకాదు.. అటు బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ.. పూర్తిగా విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్న ఆశతో.. గోవా టూర్ అంటే.. అంతా రెడీ అంటారు. అయితే ఇప్పుడు అక్కడి గోవా సర్కార్ మందుబాబులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇక గోవాకి వెళ్లి మందు తాగుతూ ఎంజాయి చేద్దామనుకునే వారు.. ఇంతకు ముందులా ఎంజాయ్ చెయ్యలేరు. ఎందుకంటే.. ఇప్పటి వరకు చాలా తక్కువ ధరకు లభించిన మందుపై భారీగా సుంకాల్ని పెంచింది అక్కడి సర్కార్.

లిక్కర్ రేట్లను రేట్లను 20% -50% శాతం వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించిన ధరలను ఈ ఏడాది ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పెంచిన ధరలతో ప్రభుత్వానికి అదనంగా 100 కోట్ల ఆదాయం వస్తుందని గోవా సర్కార్ చెబుతోంది. కాగా సామాన్యుడిపై పన్నుల భారం వేయకుండా.. ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే పెంచామని ప్రభుత్వం సర్ధిచెప్పుకుంది.