విదేశీ బుక్ చేస్తే.. స్వదేశీ ఫ్రీ.. వ్యభిచారంలో సూపర్ ఆఫర్..!

దేశ వ్యాప్తంగా రోజురోజుకు వ్యభిచార ముఠాలు వింతపోకడలను అనుకరిస్తున్నాయి. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని.. వారిని బలవంతంగా ఈ వ్యభిచార రొంపిలోకి దింపి.. వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి ఈ ముఠాలు. రోజురోజుకు ఈ వ్యభిచార ముఠాల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఓ వైపు నిత్యం పోలీసులు దాడులు జరుపుతూ వ్యభిచార దందాలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్న.. ఈ ముఠాలు కొత్త పంథాలో వారి కార్యకలాపాలను కొనసాగిస్తూ.. సవాల్ విసురుతున్నాయి. […]

విదేశీ బుక్ చేస్తే.. స్వదేశీ ఫ్రీ.. వ్యభిచారంలో సూపర్ ఆఫర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 08, 2020 | 11:22 AM

దేశ వ్యాప్తంగా రోజురోజుకు వ్యభిచార ముఠాలు వింతపోకడలను అనుకరిస్తున్నాయి. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని.. వారిని బలవంతంగా ఈ వ్యభిచార రొంపిలోకి దింపి.. వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి ఈ ముఠాలు. రోజురోజుకు ఈ వ్యభిచార ముఠాల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఓ వైపు నిత్యం పోలీసులు దాడులు జరుపుతూ వ్యభిచార దందాలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.

పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్న.. ఈ ముఠాలు కొత్త పంథాలో వారి కార్యకలాపాలను కొనసాగిస్తూ.. సవాల్ విసురుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. సోషల్ మీడియా ద్వారా.. విటులను ఆకర్షిస్తూ కార్పోరేట్ రేంజ్‌లో వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి ఈ ముఠాలు. తాజాగా ఈ దందాలో విటులకు బంపర్ ఆఫర్లంటూ కొత్త దారులను ఎంచుకున్నారు. స్వదేశీ అమ్మాయిలతో పాటు విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి.. ఈ వ్యభిచార దందాను కొనసాగిస్తూ.. ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో పట్టుబడ్డ ఓ హైటెక్ సెక్స్ రాకెట్ ముఠాలో విదేశీ యువతులు కూడా పట్టుబడ్డారు. వీరిని విచారించగా పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. విటులను ఆకర్షించేందుకు.. ఈ హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌‌లను కూడా ప్రకటిస్తున్నారట.

విదేశీ యువతిని బుక్ చేస్తే.. స్వదేశీ యువతి ఫ్రీ అంటా… పుణేలో పట్టుబడ్డ ముఠాలోని బాధితులను విచారిస్తే పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. విటులు విదేశీ యువతిని బుక్‌ చేసుకుంటే.. వారికి ఓ స్వదేశీ యువతి ఫ్రీగా పడక సుఖం అందించే విధంగా ఈ ఆఫర్ ఉంటుందట. ఈ విషయాన్ని పట్టుబడ్డ విటులు చెప్పడంతో.. ఒక్కసారిగా పోలీసులు షాక్ తిన్నారు.

ఈ హైటెక్ వ్యభిచారం నిర్వహించే ముఠాలు.. రష్యా, ఉక్రెయిన్‌, సెర్బియా దేశాల నుంచి అందమైన అమ్మాయిలను విజిటింగ్‌ వీసాలపై తీసుకొచ్చి. .వారితో ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ ముఠా నిర్వాహకులు.. అమ్మాయిల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అప్‌లోడ్ చేస్తూ.. విటులను ఆకర్షిస్తూ.. భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు తేలింది.