AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వైరల్‌గా వీరోష్ జంట ఫొటోలు!

తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రణబాలి ఒకటి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

తిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వైరల్‌గా వీరోష్ జంట ఫొటోలు!
Vijay, Rashmika
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2026 | 11:09 AM

Share

టాలీవుడ్‌లో అభిమానుల ఆదరణ పొందుతున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ్, రష్మిక జంటకు తీర్థప్రసాదాలు అందజేశారు. పెళ్లి తర్వాత కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు విజయ్ , రష్మిక. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి కనిపించినా, ఏదైనా శుభకార్యంలో పాల్గొన్నా సోషల్ మీడియాలో చర్చ మొదలవుతుంది. ఇప్పుడు తిరుమల పర్యటనతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. అభిమానులు వీరిని ప్రేమగా ‘వీరోష్’ అని పిలుచుకుంటారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్, రష్మిక వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఉదయ్‌పూర్‌లో  వీరి వివాహం జరిగింది. తమ అభిమాన జంట కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ‘రణబాలి’ కథ బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమ ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో సాగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. కఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. రణబాలితో విజయ్, రష్మిక జంట  ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us