ఇవి సగం వేగిన తర్వాత, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. తరువాత, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కలు, ఒక బంగాళాదుంప ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించండి. మీకు నచ్చిన ఇతర కూరగాయలు, క్యాప్సికం లేదా కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు.
కడిగి నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి కుక్కర్‌లో వేయండి. ఒకసారి బాగా కలిపి, రుచికి సరిపడా ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల ఉప్పు కలపండి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను వేసి కలపండి. ముందుగా కొలిచి పెట్టుకున్న రెండు గ్లాసుల కొబ్బరి పాలను పోయండి.
ఒకసారి బాగా కలిపి, ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే అర టీ స్పూన్ గరం మసాలా కలుపుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. బియ్యం నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది.
రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కిందకి దించి నైవేద్యంగా పెట్టడమే.