AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను భిక్షగాడి పాత్ర అయినా, ధనవంతుడి పాత్ర అయినా చేయగలడు : యాంకర్ రవి

యాంకర్ రవి మాట్లాడుతూ, కళాకారుల ఎదుగుదలకు సొంత కృషి, విభిన్నమైన ప్రదర్శనలే కారణమని స్పష్టం చేశారు. తన తోటి యాంకర్ గురించి మాట్లాడుతూ ఎలాంటి పాత్రకైనా ఇమిడిపోయే అద్భుతమైన నటుడని కొనియాడారు. కేవలం TRPల కోసం కాకుండా, షో విజయం పూర్తిగా కంటెంట్‌పైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నాడు

అతను భిక్షగాడి పాత్ర అయినా, ధనవంతుడి పాత్ర అయినా చేయగలడు : యాంకర్ రవి
Ravi
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2026 | 10:49 AM

Share

తెలుగు టెలివిజన్ పరిశ్రమలో యాంకర్ రవి తన సుదీర్ఘ అనుభవంతో కళాకారుల ఎదుగుదల, షోల విజయం, కంటెంట్ ప్రాధాన్యత వంటి అంశాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. యాదమ్మ రాజు, సద్దాం, హరీష్ వంటి నూతన తరం ప్రతిభావంతులు సాధిస్తున్న విజయాలను ప్రస్తావిస్తూ, ఇది వారి సొంత కృషి, రాసిపెట్టిన ప్రయాణమేనని రవి అభిప్రాయపడ్డారు. ఎవరు ఎవరికీ విజయాన్ని ఇవ్వలేరని, ప్రతి ఒక్కరూ తమ హార్డ్ వర్క్ ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఒక కళాకారుడు నిత్యం తనను తాను విశ్లేషించుకోవాల్సిన అవసరాన్ని రవి తెలిపారు. “నీకు కాంపిటీషన్ ఇలా ఉంది, నీలాగే వీడు చేయగలుగుతున్నాడు, పది మంది చేయగలుగుతున్నారు. కానీ నువ్వు ఎంత స్పెషల్.? నువ్వు ఎంత డిఫరెంట్‌గా చేయగలుగుతావు.? నిన్నే ఎందుకు ఇష్టపడాలి జనాలు.?” అని ప్రశ్నించుకోవాలని సూచించారు.

తాను యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించినప్పుడు ప్రభాకర్, ఓంకార్, ప్రదీప్ వంటి దిగ్గజాలు ఉన్నారని, వారిని అనుకరించడం కాకుండా, తాను ఎలా విభిన్నంగా ఉండగలనని ఆలోచించానని రవి గుర్తు చేసుకున్నారు. “ప్రతి ఒక్కరికీ వేర్వేరు బలాలు, వేర్వేరు ప్రదర్శన విధానాలు ఉంటాయి, అది తెలుసుకోవాలి” అని అన్నారు. ఇది “హోంవర్క్” అని, ఏ వృత్తికైనా ఇది చాలా ముఖ్యమని రవి అన్నారు.

సుడిగాలి సుధీర్ ప్రస్తావన వచ్చినప్పుడు, రవి ఆయన బహుముఖ ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడారు. “సీ, హి ఈజ్ ఏ పెర్ఫార్మర్. నువ్వు వాడిని గ్లాసులో ఇయ్యి, ఆ గ్లాస్ షేప్ చేసుకుంటాడు. నువ్వు జగ్గులో ఇయ్యి, జగ్గు షేప్‌లోకి వెళ్ళిపోతాడు” అంటూ సుధీర్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని ఉదాహరించారు. భిక్షగాడి పాత్ర అయినా, ధనవంతుడి పాత్ర అయినా సుధీర్ చేయగలడని, యాంకరింగ్ అనేది ఆయన ప్రతిభకు ఒక “కీర్తి కిరీటం” మాత్రమేనని అన్నారు. సుధీర్‌కు ఉన్న భారీ అభిమానుల వల్ల TRPలు వస్తాయని, అయితే అది ఆయనకు ఉన్న నటన, ప్రదర్శన సామర్థ్యం వల్లేనని రవి స్పష్టం చేశారు. చివరగా, కొత్త టాలెంట్ తప్పకుండా రావాలని, ప్రస్తుత పోటీలోనూ దానికి స్థానం ఉంటుందని రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us