AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఆరో వారం నామినేషన్లలో ట్విస్టులు.. రోహిత్ వర్సెస్ వంశీ, ఝాన్సీ మధ్య మాటల యుద్ధం!

బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారం నామినేషన్లలో రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య మాటల యుద్ధం జరిగింది. రోహిత్ వంశీ, ఝాన్సీని టార్గెట్ చేయడంతో ముగ్గురి మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా రోహిత్ కు ఇద్దరూ ఇచ్చిపడేశారు .

Bigg Boss Telugu 9: ఆరో వారం నామినేషన్లలో ట్విస్టులు.. రోహిత్ వర్సెస్ వంశీ, ఝాన్సీ మధ్య మాటల యుద్ధం!
Bigg Boss10
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2026 | 7:12 AM

Share

బిగ్ బాస్ తెలుగు ఇంట్లో ఆరో వారం నామినేషన్ల సందడి మొదలైంది. ఈసారి నామినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల పాత్ర కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఓజీ కంటెస్టెంట్ల మధ్యే నామినేషన్ల పోరు సాగనుండటంతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో రోహిత్, వంశీ, ఝాన్సీ మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు ప్రత్యేక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. వారు ఇద్దరు పాత కంటెస్టెంట్లను ఎంపిక చేసుకుని టాస్కులో పోటీ పడేలా చేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. ఈ పోటీలో విజయం సాధించిన కంటెస్టెంట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లభిస్తుందని తెలిపాడు.

ఈ క్రమంలో శివ్.. త్రిగుణ్, రోహిత్‌లను ఎంపిక చేశాడు. ఇద్దరి మధ్య జరిగిన పోటీలో రోహిత్ విజయం సాధించాడు. దీంతో అతడికి ఇద్దరు హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలో వంశీ, ఝాన్సీలను రోహిత్ టార్గెట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా రోహిత్, వంశీ మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా సాగింది. తన ఆటతీరుపై వంశీ చేసిన వ్యాఖ్యలకు రోహిత్ ఘాటుగా స్పందించాడు. వంశీ కూడా దానికి ధీటుగా మాట్లాడాడు. నామినేషన్ల విషయంలో తన తెలివిని ఉపయోగించి పాయింట్లు పెట్టారని రోహిత్ అన్నాడు.. తన గురించి మాట్లాడే విషయంలో హద్దులు దాటవద్దని వంశీ కౌంటర్ ఇచ్చాడు.

ఇక తాను ఎలా మాట్లాడాలో కూడా రోహిత్ స్క్రిప్ట్ ఇస్తాడా.? అని వంశీ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. దీనికి స్పందించిన రోహిత్.. స్క్రిప్ట్ ఇచ్చేంత అర్హత కూడా తనకు లేదని, తాను హీరోను కాదన్నట్టుగా వంశీ మాట్లాడుతున్నాడని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు ఝాన్సీని కూడా రోహిత్ ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ఇమ్యూనిటీ వద్దని చెబుతున్నప్పుడు కెప్టెన్సీ ఎందుకు కావాలని రోహిత్ ప్రశ్నించాడు. కెప్టెన్సీ వల్ల ఇమ్యూనిటీ లభిస్తుంది కదా అని రోహిత్ మాట్లాడాడు. అయితే దీనికి ఝాన్సీ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ఇమ్యూనిటీ కోసమే కెప్టెన్ కావాలని తాను అనుకోలేదని, ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ కోరుకున్నానని స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరి మధ్య కూడా వాదన వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఇక ఝాన్సీ ఆటతీరుపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పటివరకు ఆమె ఆట తనకు కనిపించలేదని, ఇకపై కూడా కనిపిస్తుందనే నమ్మకం లేదన్నట్లు మాట్లాడాడు. దీనికి వంశీ స్పందిస్తూ.. బయటకు వెళ్లిన తర్వాత తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చాడు. తాను కప్పు గెలుచుకుని బయటకు వెళ్తానని రోహిత్ అనగా, ఇంట్లో ఉన్న కప్పులే కడగడం రాదంటూ వంశీ సెటైర్ వేశాడు.  నామినేషన్ల సందర్భంగా ఝాన్సీ గతంలో చెప్పిన మాటలను కూడా రోహిత్ ప్రస్తావించాడు. తనకు ప్రేక్షకుల మద్దతు ఉందని, తన ఆటను చూసి జనాలు ఓట్లు వేస్తారని ఝాన్సీ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ రోహిత్ పాయింట్లు లేవనెత్తాడు. అయితే ఝాన్సీ కూడా వెనక్కి తగ్గలేదు. అవసరమైనప్పుడు ప్రేక్షకులు ఆటను గమనిస్తారని తాను ఒక్కసారి చెబితే, రోహిత్ మాత్రం పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడని అంది. అంతేకాకుండా సింపతీ గేమ్ ఆడుతున్నది తనా, రోహితా అనే చర్చకు తెరలేపింది. రోహిత్, వంశీ మధ్య జరిగిన వాదనలో వంశీ చెప్పిన కొన్ని పాయింట్లు కరెక్ట్ గా అనిపించాయని శివ్ కూడా కామెంట్ చేశాడు. వంశీ నామినేషన్ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచుతోంది.  మరోవైపు త్రిగుణ్ తన నామినేషన్ల పరిస్థితి గురించి దక్షితో మాట్లాడాడు. గత రెండు, మూడు వారాలుగా తనను ఎవరూ నామినేట్ చేయడం లేదని అతడు చెప్పుకున్నాడు. అయితే ఈ విషయం పై ఝాన్సీ మాట్లాడుతూ. త్రిగుణ్‌ను నామినేట్ చేయకుండా ఉండటం వెనుక రోహిత్ వ్యూహం ఉండొచ్చని అంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు ఇంట్లో ఆరో వారం నామినేషన్లు కంటెస్టెంట్ల మధ్య కొత్త వివాదాలకుదారి తీసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us