AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 4th T20I: విండీస్ పాలిట విలన్ వచ్చేస్తున్నాడ్రోయ్.. ఉప్పల్‌ నుంచి అస్సాం పార్సిలే ఇక..!

India vs West Indies 4th T20I: భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలవగా, నాలుగో టీ20 మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ కీలక పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఓపెనర్లు సంజు శాంసన్ ఫామ్, యువ వైభవ్ సూర్యవంశీకి అవకాశంపై చర్చ జరుగుతోంది.

IND vs WI 4th T20I: విండీస్ పాలిట విలన్ వచ్చేస్తున్నాడ్రోయ్.. ఉప్పల్‌ నుంచి అస్సాం పార్సిలే ఇక..!
Ind Vs Wi 4th T20i Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Oct 13, 2026 | 10:21 AM

Share

India vs West Indies 4th T20I: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అభిమానులకు ఉత్కంఠతతోపాటు ఉత్సాహాన్ని అందిస్తోంది. సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో టీ20లో వెస్టిండీస్ అనూహ్యంగా 250 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది. ఇక నిన్న, ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మూడో టీ20 కూడా చివరి వరకు ఉత్కంఠ రేపింది. భారత్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరేబియన్ జట్టు 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌పై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ కీలక మ్యాచ్ హైదరాబాద్‌లో బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు, ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని వెస్టిండీస్ జట్టు కూడా పట్టుదలతో ఉంది.

ఎక్కువమంది చదివినది: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీలో మార్పులు చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ 21, 20, 69 పరుగులు చేయగా, సంజు శాంసన్ 11, 82, 3 పరుగులనే సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సంజు శాంసన్, రెండో టీ20లో 82 పరుగులతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, ఇండోర్ మ్యాచ్‌లో మళ్లీ నిరాశపరిచాడు. కీలక సమయంలో కేవలం 3 పరుగులకే అవుట్ కావడం జట్టుకు నష్టం కలిగించింది.

సంజు శాంసన్ స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతుండటంతో, యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వెస్టిండీస్ సిరీస్ మొత్తంలో సంజు శాంసన్‌ను ఆడించడానికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. ఈ కారణంగా, వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కాక తప్పదని చాలామంది భావిస్తున్నారు.

అయితే, మాజీ క్రికెటర్లు మాత్రం వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్ మ్యాచ్‌లో గెలిచేసి టీమిండియా 3-1తో సిరీస్ సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత, చివరిదైన ఐదో టీ20లో వైభవ్ సూర్యవంశీని ఆడించాలి” అని అభిషేక్ నాయర్ సూచించాడు. మరోవైపు, శ్రీకాంత్ గవాస్కర్ వంటి ప్రముఖులు కూడా వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: 6,W,6,W,6,W,6,W,6,W.. సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

కాగా, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే టీమిండియా తరపున ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 246 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. అతని వయసు, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా, అతనికి అవకాశం ఇవ్వాలనే వాదనకు బలం చేకూరుతోంది.

నాలుగో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుండగా, ఐదో టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. హైదరాబాద్ మ్యాచ్ ఫలితం సిరీస్ గమనాన్ని నిర్ణయించనుంది. టీమిండియా ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో, తుది జట్టులో మార్పులు ఉంటాయో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us