AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలు నుంచి వచ్చి సెంచరీ.. గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన భారత ఆటగాడు..!

రంజీ ట్రోఫీలో అభిషేక్ పోరెల్ అజేయ సెంచరీతో మెరిశాడు. అత్యాచార ఆరోపణలపై జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకొచ్చిన పోరెల్, తన శతకం తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. మాటలతో కాకుండా బ్యాట్‌తోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశాడు. గడ్డు పరిస్థితులు తనను మానసికంగా బలోపేతం చేశాయని తెలిపాడు.

జైలు నుంచి వచ్చి సెంచరీ.. గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన భారత ఆటగాడు..!
Abhishek Porel's Emotional Ranji Century
Venkata Chari
|

Updated on: Oct 13, 2026 | 10:55 AM

Share

బెంగాల్ వికెట్‌కీపర్ కం బ్యాటర్ అభిషేక్ పోరెల్ రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరుగుతున్న గ్రూప్-సి మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిశాడు. సోమవారం తన సెంచరీ పూర్తి చేసిన వెంటనే మైదానంలోనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పోరెల్.. తన భావోద్వేగానికి కారణం వివరించడంతో పాటు తనపై ఉన్న అత్యాచార ఆరోపణలపై తొలిసారి స్పందించాడు.

‘‘నేను ఏడవాలని అనుకోలేదు. కానీ కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయి. నా సెలబ్రేషన్‌ ద్వారా నేను ఎవరికీ ఏమీ చెప్పాలనుకోవడం లేదనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. నాకు క్రికెట్ ఆడటం మాత్రమే ముఖ్యం. నా ఆటతోనే అందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నాను’’ అని పోరెల్ తెలిపాడు.

‘‘నేను భిన్నమైన ప్రపంచంలో, పూర్తిగా వేరే పరిస్థితుల్లో ఎలా నిలబడాలో చూశాను. ఆ అనుభవం నుంచి చాలా సానుకూల విషయాలు నేర్చుకున్నాను. అవి నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను నేను గడిపిన విధానం.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని నిరంతరం గుర్తుచేసింది. నేను నా మాటలతో సమాధానం ఇవ్వను.. నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను’’ అని ఆయన పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 6,W,6,W,6,W,6,W,6,W.. సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

ఆదివారం ఢిల్లీని తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ చేసిన బెంగాల్.. సోమవారం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 304/3 పరుగులు చేసింది. ఘరామి 221 బంతుల్లో 122 పరుగులతో, అభిషేక్ పోరెల్ 161 బంతుల్లో 114 పరుగులతో అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 199 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

అభిషేక్ పోరెల్‌పై ఆరోపణలు ఏమిటి?

కర్ణాటకకు చెందిన ఓ యువ వైద్య విద్యార్థిని జూన్ 23న మొగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు చేసింది. తాము సుమారు మూడున్నరేళ్లుగా బంధంలో ఉన్నామని, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

తామిద్దరూ కలిసి విదేశాలకు కూడా వెళ్లినట్లు ఆమె ఆరోపించింది. అయితే ఆ తర్వాత పోరెల్ తమ మధ్య ఉన్న సంబంధాన్ని అంగీకరించలేదని, దీంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది.

సుమారు ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని, ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినది: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?

జూన్‌లో ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రనగర్‌లోని పోరెల్ నివాసానికి పలుమార్లు వెళ్లినప్పటికీ అతడు అక్కడ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత ఆ యువతి కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు జూలై 20న పోరెల్‌ను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. అత్యాచార ఆరోపణతో పాటు క్రిమినల్ బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించిన ఆరోపణలు కూడా కోర్టు విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అభిషేక్ పోరెల్ బెయిల్‌పై బయట ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us