Train Ticket Booking: తత్కాల్ టికెట్ దొరకలేదా? బుక్‌చేసే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి.. నిమిషాల్లో సీటు కన్ఫామ్..!

రైల్వే వ్యవస్థ సామాన్య ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పేర్కొనవచ్చు. రోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. అందుకే ఇది సాధారణ ప్రజల జీవితానికి ఆయువుపట్టుగా..

Train Ticket Booking: తత్కాల్ టికెట్ దొరకలేదా? బుక్‌చేసే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి.. నిమిషాల్లో సీటు కన్ఫామ్..!
Train
Follow us

|

Updated on: Mar 20, 2023 | 7:20 AM

రైల్వే వ్యవస్థ సామాన్య ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పేర్కొనవచ్చు. రోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. అందుకే ఇది సాధారణ ప్రజల జీవితానికి ఆయువుపట్టుగా పరిగణించబడుతుంది. పండుగల సమయంలో రైళ్లలో రద్దీ చాలా రెట్లు పెరుగుతుంది. వేసవి సెలవులు రాబోతున్నాయి. విద్యార్థులు, ప్రజలు తమ తమ ఇళ్లకు రావడానికి ట్రైన్ టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే, పలు సందర్భా్ల్లో టికెట్ బుక్ అవ్వక జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి పరిస్థితిలో చాలా మంది తత్కాల్ టికెట్లను ఆశ్రయిస్తారు. రద్దీ కారణంగా అవి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చిన్న ట్రిక్ పాటించడం ద్వారా సులభంగా టికెట్ పొందవచ్చు. ఆ ట్రిక్ ఏంటంటే.. ఐఆర్‌సీసీ మాస్టర్ లిస్ట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవాలి.

మాస్టర్ లిస్ట్ అంటే ఏంటి?

IRCTC ప్రయాణికులను మాస్టర్ లిస్ట్ రూపొందించడానికి అనుమతిస్తుంది. ఈ మాస్టర్ లిస్ట్ ఏంటి అనే సందేహం వస్తుందా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణికులు తమ టికెట్ బుక్ చేసుకునే ముందు.. ఆ ప్రయాణీకుల పేరు, వయస్సు, ఇతర వివరాలను నమోదుు చేసే ముందు మాస్టర్ లిస్ట్‌ను రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత, టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణీకుల వివరాలను పదే పదే ఎంటర్ చేయడానికి బదులుగా ఈ మాస్టర్ లిస్ట్ నుంచి ప్రయాణీకుల వివరాలను ఫాస్ట్‌గా యాడ్ చేయొచ్చు. ఇది మీ టికెట్ బుకింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. ధృవీకరించబడిన టిక్కెట్‌ను పొందే అవకాశాలను పెంచుతుంది. IRCTC ప్రొఫైల్ విభాగానికి వెళ్లడం ద్వారా ఈ లిస్ట్ తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మాస్టర్ లిస్ట్‌ను ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ విధంగా మాస్టర్ లిస్ట్ సిద్ధం చేయండి..

1. ముందుగా IRCTC యాప్‌ను ఓపెన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

2. ఆపై మై అకౌంట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, మై మాస్టర్ లిస్ట్‌కు వెళ్లాలి.

3. అక్కడ ఎలాంటి లిస్ట్ లేకపోతే.. ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

4. ఆ తరువాత యాడ్ ప్యాసింజర్స్ పై క్లిక్ చేయాలి.

5. ఆ తర్వాత.. వ్యక్తి పేరు, వయస్సు వంటి ప్రయాణీకులందరి వివరాలను పూరించాలి.

6. ఆ తర్వాత సేవ్ చేయాలి.

టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మాస్టర్ లిస్ట్‌ను ఎలా ఉపయోగించాలి..?

1. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్లాన్ మై జర్నీపై క్లిక్ చేయండి.

2. ఆ తర్వాత స్టేషన్, తేదీని ఎంచుకోవాలి.

3. ఆపై ప్రయాణీకుల వివరాలకు వెళ్లాలి.

4. ఆ తర్వాత, యాడ్ ప్యాసింజర్స్ ఎంపికకు వెళ్లి, మాస్టర్ జాబితా నుండి ప్రయాణీకుల వివరాలను నమోదు చేయాలి.

5. ఇప్పుడు డబ్బులు చెల్లించాలి. టిక్కెట్ బుకింగ్ కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది.

6. మాస్టర్ లిస్ట్ కారణంగా మీ టికెట్ బుకింగ్ వ్యవధి తగ్గుతుంది. దీని కారణంగా మీరు తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో ధృవీకరించబడిన టిక్కెట్‌ను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..