Indian Railways: త్వరలో అందుబాటులోకి అల్యుమినియం రైల్వే కోచ్‌లు.. వీటి వల్ల కలిగే ఉపయోగం ఏంటనేగా..
Indian Railways Aluminium Coaches: భారతీయ రైల్వే ఆధునికతవైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఓపెన్ విండోస్, విమానాన్ని తలపించే 'వందే భారత్' రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే తాజాగా మరో..
Indian Railways Aluminium Coaches: భారతీయ రైల్వే ఆధునికతవైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఓపెన్ విండోస్, విమానాన్ని తలపించే ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే తాజాగా మరో కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా అల్యూమినియంతో తయారు చేసిన రైల్ కోచ్‌లను ప్రవేశపెట్టే పనిలో పడింది ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వేను ఆధునిక సాంకేతికతవైపు అడుగులు వేయించే క్రమంలో మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎమ్‌సీఎఫ్) అల్యూమినియంతో కోచ్‌లను తయారు చేయనుంది. ఇందులో భాగంగా మొదటగా వచ్చే ఏడాది కల్లా కోల్‌కతా మెట్రో రైల్‌కోసం ఈ బోగీలను రూపొందించనున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లకు కూడా ఈ బోగీలను ఉపయోగించాలని ఇండియణ్ రైల్వేస్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఎమ్‌సీఎఫ్ ఇప్పటికే సౌత్ కొరియాకు చెందిన ఓ సంస్థతో రూ. 128 కోట్ల ఒప్పందాన్ని చేసుకుంది. అయితే ఇప్పటికే కోచ్‌ల తయారీ ప్రారంభంకావాల్సి ఉండగా ఇటు భారత్‌తో పాటు, అటు కొరియాలోనూ కరోనా విలయతాండవం చేయడంతో వాయిదా పడింది. మెట్రో రైళ్లకు ఉపయోగించే అల్యూమినియం కోచ్‌ల డిజైన్ ఈ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. సదరు డిజైన్‌లను ఎమ్‌సీఎఫ్ అంగీకరించగానే తయారీ ప్రారంభంకానుంది. రైలు గంటకు 225 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా తట్టుకోవడం ఈ కోచ్‌ల ప్రత్యేకత.
అల్యూమినియం కోచ్‌లతో కలిగే లాభాలు ఏంటంటే..
* సాధారణ స్టెయిన్‌లెస్ స్టీల్ కోచ్‌లతో పోలిస్తే.. ఈ కోచ్‌లు తక్కువ బరువు ఉంటాయి. దీనివల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. * అల్యూమినియంతో తయారు చేసిన కోచ్‌లకు అంత సులభంగా తుప్పు పట్టదు. ఇవి సుమారు 40 ఏళ్లపాటు మన్నికతో ఉంటాయి. * వీటి తయారీకి తక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. * ఇప్పటి కోచ్‌లతో పోలిస్తే అల్యూమినియం కోచ్‌లు తక్కువ బరువు ఉంటాయి. ఈ కారణంగా రైల్ వేగం పెరుగుతుంది.
Also Read: Viral Pic: ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!
Anantapur District: పాల చాటు మద్యం.. చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది