India-China Dispute: చైనా కవ్వింపులకు చెక్ పెట్టేలా మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. రంగంలోకి మరో 9,400 మంది జవాన్లు..
భారత్ - చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనల మధ్య కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా - భారత్ సరిహద్దు ప్రాంతమైన వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి వ్యూహాత్మక చర్యలు ప్రారంభించింది.

భారత్ – చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనల మధ్య కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా – భారత్ సరిహద్దు ప్రాంతమైన వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి వ్యూహాత్మక చర్యలు ప్రారంభించింది. భారత్-చైనా LAC గార్డింగ్ ఫోర్స్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన ఏడు న్యూస్ బెటాలియన్‌లను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కొత్త బెటాలియన్లు, సెక్టార్ హెడ్‌క్వార్టర్‌ల ఇండక్షన్ 2025 నాటికి రూ.1,800 కోట్లకు పైగా ఖర్చుతో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) బెటాయిన్లలో మొత్తం 9,400 మంది సిబ్బందిని మోహరించనున్నారు. దీనికోసం మోడీ ప్రభుత్వం నుంచి బుధవారం అనుమతులు లభించాయని అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో చైనా తరచూ వివాదాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మరింత మంది ఐటీబీపీ సిబ్బందిని మోహరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల చైనా కుట్రలు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్ర ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం, ITBP లడఖ్‌లోని కారకోరం పాస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జాచెప్ లా వరకు 3,488 కి.మీ పొడవైన భారతదేశం-చైనా సరిహద్దులను కాపాడుతుంది. ఇది కాకుండా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా అనేక అంతర్గత భద్రతా విధులు, కార్యకలాపాలలో కూడా ఈ దళం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రత్యేక సాయుధ పోలీసు దళం సిబ్బందికి ఇంటెన్సివ్ వ్యూహాత్మక శిక్షణతో పాటు పర్వతారోహణ, స్కీయింగ్ వంటి వివిధ విభాగాలలో శిక్షణ ఇస్తారు. ఇది హిమాలయ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలకు ‘ఫస్ట్ రెస్పాండర్స్’గా సహాయ, సహాయ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది. వివిధ విపత్తుల కారణంగా ఆపదలో ఉన్న వేలాది మంది పౌరులకు సహాయం అందించడానికి ITBP సంవత్సరాలుగా వందల కొద్దీ శోధన, రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే.




మరిన్ని జాతీయ వార్తల కోసం..