Indian Coast Guard: 27 మంది బంగ్లాదేశ్ జాలర్లను కాపాడిన భారత కోస్ట్‌గార్డ్స్..
మొత్తంగా ప్రతికూల వాతావరణం మధ్య ఒకే రోజులో 27 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను మూడు వేర్వేరు ఆపరేషన్లలో భారత కోస్ట్‌గార్డ్ రక్షించారు.
Indian Coast Guard: బంగాళాఖాతంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ జాలర్లను భారత కోస్ట్‌గార్డ్ కాపాడింది. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జాలర్ల పడవ చిక్కుకుంది. గల్లంతైన వారిని కోస్ట్‌గార్డ్ నౌక అనుమోల్ కాపాడింది. శనివారం నుంచి సహాయక చర్యలు కొనసాగాయి. శనివారం 10 మందిని రక్షించగా తాజాగా మరో 17 మందిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు.
బంగదుని ఐలాండ్ సమీపంలో బంగ్లాదేశ్ జాలర్ల ఆచూకీ లభించింది. అంతకుముందు 10 మంది భారతీయ జాలర్లను కూడా కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు. బంగ్లాదేశ్ జాలర్లను బెంగాల్ లోని హల్దియా పోర్ట్‌కు తీసుకొచ్చారు. మొత్తంగా ప్రతికూల వాతావరణం మధ్య ఒకే రోజులో 27 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను మూడు వేర్వేరు ఆపరేషన్లలో భారత కోస్ట్‌గార్డ్ రక్షించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా జాతీయ వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..