Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెఢీ.. LAC వెంబడి అత్యాధునిక ఆయుధాల మోహరింపు.. వీడియో

డ్రాగన్‌ ఆర్మీ కదలికలపై భారత సైన్యం నిరంతరం నిఘా పెడుతోంది. అధునాతన యుద్దట్యాంకులకు కూడా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దింపింది. LAC దగ్గర చైనా కదలికలపై డ్రోన్లతో నిఘా పెట్టారు. చైనా ఆక్రమణలను అడ్డుకునేందుకు రక్షణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

India: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెఢీ.. LAC వెంబడి అత్యాధునిక ఆయుధాల మోహరింపు.. వీడియో
Indian Army
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2022 | 5:36 PM

Indian Army: సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ రెడీ అయ్యింది. లద్దాఖ్‌ లోని పాంగాంగ్‌ సరస్సు దగ్గర అధునాతన ఆయుధాలను మొహరించింది భారత్‌. పాంగాంగ్‌ సరస్సులో ఆర్మీ బోట్‌ నిరంతరం పహారా కాస్తోంది. డ్రాగన్‌ ఆర్మీ కదలికలపై భారత సైన్యం నిరంతరం నిఘా పెడుతోంది. అధునాతన యుద్దట్యాంకులకు కూడా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దింపింది. LAC దగ్గర చైనా కదలికలపై డ్రోన్లతో నిఘా పెట్టారు. చైనా ఆక్రమణలను అడ్డుకునేందుకు రక్షణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. లద్దాఖ్‌లో తరచుగా ఆక్రమణలకు పాల్పడుతోంది చైనా. దీనిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం కూడా రెడీ అయ్యింది. ఓవైపు చర్చలు జరుపుతూనే చైనా బలగాలు లద్దాఖ్‌తో పాటు అరుణాచల్‌లో దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో చైనా వ్యూహాలను తిప్పికొట్టేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం అత్యాధునిక ఆయుధాలను ఆర్మీకి అప్పగించింది.

రక్షణ మంత్రిరాజ్‌నాథ్ సింగ్ మంగళవారం దేశ రక్షణ రంగాన్ని మరింతగా పెంచేందుకు పలు స్వదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, అత్యాధునిక డ్రోన్లను ఆర్మీకి అందజేశారు. ఈ ఆయుధాల్లో యాంటీ పర్సనల్ ల్యాండ్‌మైన్ ‘నిపున్’, కార్యకలాపాల కోసం ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్ ఉన్నాయి. పాంగోంగ్ త్సో సరస్సు, పదాతిదళ పోరాట వాహనాలు, అనేక ఇతర ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పంచుకున్న విజువల్స్‌లో ఆర్మీ సిబ్బంది.. ఎల్ఏసీ పాంగోంగ్ త్సో వద్ద మోహరించిన ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఈ పడవలు ఒకేసారి 35 పోరాట దళాలను మోసుకెళ్లగలవు. ఇంకా సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేరుకోగలవు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..