Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: వాళ్ల చేతులు, కాళ్లు విరగ్గొట్టండి.. బెయిల్ ఇప్పిస్తా.. శిండే వర్గం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

ప్రస్తుతం ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీశాయి.

Maharashtra Politics: వాళ్ల చేతులు, కాళ్లు విరగ్గొట్టండి.. బెయిల్ ఇప్పిస్తా.. శిండే వర్గం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
Prakash Surve
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2022 | 3:12 PM

MLA Prakash Surve Comments: శివసేన పార్టీ, గుర్తు హక్కులపై అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇటు తిరుగుబాటు నేత షిండే మద్దతుదారుల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో థాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మద్దతుదారుడు, మగథానే ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడ్డోస్తే వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. అవసరమైతే బెయిల్ ఇప్పిస్తానంటూ.. థాక్రే వర్గాన్ని ఉద్దేషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీశాయి. ముంబైలోని మాగాఠణే ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వే శివసేనలో విభేదాల గురించి మాట్లాడారు. ఎవరిది నిజమైన శివసేన? దీని గురించి ఎవరైనా ఏమైనా చెబితే గట్టిగా జవాబు చెప్పండి.. ఎవరి దాదాగిరీని సహించేది లేదు.. అవసరమైతే వారిని కొట్టండి. వినకపోతే.. వాళ్ల చేతులు విరగ్గొట్టలేకపోతే, కాళ్లు విరగ్గొట్టండి.. మీకు బెయిల్‌ ఇప్పించేందుకు మరుసటిరోజే వస్తా.. మీవెంట ప్రకాశ్‌ సుర్వే ఉన్నాడంటూ.. కార్యకర్తలకు సూచించారు. తాము ఎవరి జోలికీ వెళ్లమని, కానీ తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమంటూ ఉద్ధవ్ థాక్రే వర్గాన్ని హెచ్చరించారు.

దీనికి సంబంధించిన వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉద్ధవ్ థాక్రే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వేపై ఉద్ధవ్ అనుచరులు దహిసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై థాక్రే వర్గంతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించనుంది. అటు సీఎం శిండే కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుర్వే వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..