AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: బోర్డర్‌లో ఇకనుంచి కథ వేరే.. తేడా వస్తే పాక్‌ తడుపుకోవాల్సిందే..!

Anchor: పాక్‌ బార్డర్‌లో ఇకనుంచి కథ వేరేలా ఉండనుంది. పంజాబ్‌లో కీలక ఆయుధ వ్యవస్థను మోహరించింది ఇండియా. ఏంటా వ్యవస్థ? దాని పాక్‌కు ఎందుకు భయం?

India vs Pakistan: బోర్డర్‌లో ఇకనుంచి కథ వేరే.. తేడా వస్తే పాక్‌ తడుపుకోవాల్సిందే..!
Pakistan
Shiva Prajapati
|

Updated on: Dec 22, 2021 | 2:23 PM

Share

Anchor: పాక్‌ బార్డర్‌లో ఇకనుంచి కథ వేరేలా ఉండనుంది. పంజాబ్‌లో కీలక ఆయుధ వ్యవస్థను మోహరించింది ఇండియా. ఏంటా వ్యవస్థ? దాని పాక్‌కు ఎందుకు భయం? పూర్తి వివరాలు తెలుసుకుందాం. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారత ఆయుధ సంపత్తి గణనీయంగా పెరిగింది. భారతదేశాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం అత్యంత అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్-400 ట్రయాంఫ్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రష్యా ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్‌కు పంపింది. భారత వైమానిక దళం ఇప్పటికే పంజాబ్ సెక్టార్‌లో మొదటి ఎస్-400 స్క్వాడ్రన్ బ్యాటరీలను రంగంలోకి దించిందని తెలుస్తోంది.

ఈ తొలిబ్యాచ్ స్క్వాడ్రన్ బ్యాటరీలు పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోగలవని చెబుతున్నారు రక్షణ శాఖ అధికారులు. మొదటి స్క్వాడ్రన్ డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తోంది రక్షణ శాఖ. ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది ఎస్-400 వ్యవస్థ. దీనికి డ్రోన్‌ల నుంచి బాలిస్టిక్ క్షిపణుల వరకు ప్రతిదానిని నిర్వీర్యం చేసే సామర్థ్యం ఉంటుంది. ఎస్-400 ట్రయాంఫ్‌ భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే ఓ క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చవచ్చు. ఆకాశం నుంచి దూసుకొచ్చే శత్రువుల జెట్స్, రాకెట్లను ఇది భూమిపై నుంచే కూల్చేస్తుంది.

విమానాలు, మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేయగల సామర్థ్యం ఎస్‌-400 సొంతం. ఇది టెర్మినల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తక్షణమే వీటిని 1993లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు రష్యన్లు. మిస్సైల్ స్టోరేజ్ కంటైనర్లు, లాంచర్లు, రాడార్లు ఇలా వివిధ రకాల ఆయుధాలతో దీనిని తయారు చేశారు. 2007లో ఇది వినియోగంలోకి వచ్చింది.

Also read:

83 Movie: 6 నెలలు.. రోజుకు 4 గంటలు.. కపిల్ దేవ్‌లా రణవీర్‌ సింగ్ ఎలా మారాడంటే?

US: ఆ ఉగ్రవాద దాడిపై సమాచారమిస్తే 5 మిలియన్ల డాలర్ల రివార్డ్.. ప్రకటించింది ఎవరో తెలుసా..?

Fastag: ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారా? ఇకపై దానిని రీఛార్జ్ చేయకుండా రోడ్డు మీదకు వస్తే చలానా బాదుడు తప్పదు!