SI Exam: వీడు మామూలోడు కాదు.. ఎస్సై ఎగ్జామ్‌కోసం ఏం చేశాడో తెలుసా..?
SI Exam: పరీక్షల సమయంలో చాలామంది విద్యార్ధులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. చదివినవి రాకపోతే ఎక్కడ ఫెయిలవుతామో అన్న భయంతో

SI Exam: పరీక్షల సమయంలో చాలామంది విద్యార్ధులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. చదివినవి రాకపోతే ఎక్కడ ఫెయిలవుతామో అన్న భయంతో చీటింగ్ చేసి ఎగ్జామ్ రాయాలనుకుంటారు. అందుకు రకరకాల ప్లాన్స్ వేస్తారు. ఒకప్పుడు ఎగ్జామ్‌కి వెళ్లేటప్పుడు షర్ట్ కాలర్‌లోనో హాండ్స్ ఫోల్డింగ్‌లోనో స్లిప్స్ పెట్టుకుని వెళ్లేవాళ్లు. అవి బయట పడకపతోఏ ఓకే.. ఒకవేళ స్వ్కాడ్ కంటిలో పడ్డారా.. డిబారే… ఇది ఒకప్పటి కథ.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దానికి అనుగుణంగా విద్యార్ధుల ప్లాన్లు మారుతున్నాయి. ఎగ్జామ్స్‌లో చీటింగ్ కోసం టెక్నాలజీని ఎంతో తెలివిగా వాడుకుంటున్నారు విద్యార్ధులు. ఇక్కడ ఒక వ్యక్తి ఎస్‌ఐ ఎగ్జామ్ రాయడానికి వెళ్లాడు. అయితే అతను చీటింగ్ చేసి ఎగ్జామ్ రాయాలనుకున్నాడు. కానీ గేటుదగ్గరే అతని బండారం బయటపడింది…
ఉత్తరప్రదేశ్లో మెయిన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులంతా తమ తమ హాల్ టికెట్స్ తీసుకొని…ఎగ్జామ్‌హాల్‌కి వెళ్తున్నారు. అక్కడి సెక్యూరిటీ అందరినీ చెక్‌చేసి హాల్లోకి పంపిస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు భయం భయంగా వచ్చాడు. అందరిలాగే ఇతడినీ చెక్‌చేస్తున్నారు. అయితే డిటెక్టర్ అతని తలదగ్గరకు రాగానే శబ్ధం వస్తుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసినా అలాగే శబ్ధం రావడంతో అధికారులకు డౌట్ వచ్చింది. చెవి దగ్గర ఏమైనా సెట్ చేసుకున్నాడేమో అని చూస్తే… అక్కడ ఏ బ్లూటూత్ లాంటిదీ కనిపించలేదు. మరి శబ్దం ఎందుకు వస్తోంది అని ఆలోచనలో పడ్డ వారి దృష్టి అతని జుట్టుపైన పడింది. .. జుట్టును పరిశీలించారు. అది జుట్టుకాదు విగ్ అని తేలింది. అప్పుడు సీన్ అర్థమైంది అధికారులకి. విగ్‌ని జాగ్రత్తగా తొలగించి చూసి షాక్ తిన్నారు. అందులో… ఓ సిమ్, ఓ బ్యాటరీ, కొన్ని వైర్లూ కనిపించాయి. అవి చెవి దగ్గర వరకూ ఉండేలా సెట్ చేసుకున్నాడు. అంతేకాదు అతి చిన్న ఇయర్‌ఫోన్లను రెండు చెవులకూ పెట్టుకున్నాడు. వాటిని పెట్టుకున్నట్లు మామూలుగా చూస్తే తెలియట్లేదు. ఈ జుగాడ్ వీడియోని IPS ఆఫీసర్ రుపిన్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్ @rupin1992లో డిసెంబర్ 21 న పోస్ట్ చేశారు. ఈ వీడియోని వీక్షిస్తున్న నెటిజన్లు అతని అతి తెలివికి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాళ్లు ఎస్‌ఐలు అయితే డేంజరే అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Also read:
Disinvestment: ప్రస్తుతానికి ఆ బ్యాంకుల ప్రయివేటీకరణ లేనట్టే.. కీలక సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..




