Pahalgam Terror Attack: ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం.. ఉగ్రవాదులకు తగిన బుద్ది చెబుతాం!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసకొని ఉగ్రమూకలు జరిపిన కాల్పుల ఘటనపై భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ఒక పిరికిపంద చర్య అని ఆయన అన్నారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడికి భారత్ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసకొని ఉగ్రమూకలు జరిపిన కాల్పుల ఘటనపై భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడికి భారత్ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఈ దాడి ఒక పిరికిపంద చర్య అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని..ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని.. కుట్ర పన్నిన వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
आतंकवाद के ख़िलाफ़ हमारी zero tolerance की policy है। भारत का एक-एक नागरिक, इस कायरतापूर्ण हरकत के ख़िलाफ़ एकजुट है।
हम सिर्फ़ उन्हीं लोगों तक नहीं पहुँचेंगे, जिन्होंने इस घटना को अंजाम दिया हैI हम उन तक भी पहुँचेंगे, जिन्होंने परदे के पीछे बैठकर, हिंदुस्तान की सरजमीं पर ऐसी… pic.twitter.com/8HJbDxeRbU
— Rajnath Singh (@rajnathsingh) April 23, 2025
పహల్గాం ఘటనపై శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి పాల్గొన్నారు. వారితో చర్చల తర్వాత రాజ్‌నాథ్ సింగ్ ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
పహల్గామ్‌లో ఉగ్రవాదకి పాల్పడిన ఉగ్రమూకలు కశ్మీర్ లోయ సమీప ప్రాంతాల్లోనే తలదాచుకొని ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దాడి జరిగినప్పటి నుంచి కశ్మీర్ వ్యాప్తంగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానిత ప్రాంతాలను పరిశీలిస్తూ, ఉగ్రమూకల కోసం వేట కొనసాగిస్తున్నారు. దాడిలో సుమారు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని, వీరిలో 5 నుంచి 7 మంది పాకిస్థాన్‌కు చెందిన వారు ఉన్నట్టు భారత్ భద్రతా దళాలు అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…ై
