Agni-V Missile: భారత రక్షణ రంగం మరింత బలోపేతం.. విజయవంతగా అగ్ని-5 మిసైల్‌.. దీని ప్రత్యేకత ఏంటంటే..

Agni-V Missile: భారత రక్షణ రంగ వ్యవస్త మరో అద్భుతాన్ని సాకారం చేసింది. ఉపరితం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అగ్ని - 5 బాలిస్టిక్‌ క్షిపణినిని బుధవారం భారత్‌ విజయవంతంగా..

Agni-V Missile: భారత రక్షణ రంగం మరింత బలోపేతం.. విజయవంతగా అగ్ని-5 మిసైల్‌.. దీని ప్రత్యేకత ఏంటంటే..
Agni 5 Missile
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 27, 2021 | 11:25 PM

Agni-V Missile: భారత రక్షణ రంగ వ్యవస్త మరో అద్భుతాన్ని సాకారం చేసింది. ఉపరితం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అగ్ని – 5 బాలిస్టిక్‌ క్షిపణినిని బుధవారం భారత్‌ విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని భారత రక్షణ రంగంలో మరో పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో భారత రక్షణ రంగం పవర్‌ను మరోసారి భారత్‌ ప్రపంచానికి చాటిచెప్పినట్లైంది.

ఇక ఈ మిసైల్‌ ప్రత్యేక విషయానికొస్తే.. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చాలా కచ్చితత్వంతో చేధించగల సత్తా ఈ క్షిపణి సొంతం. ఈ పరీక్షను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి 7.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది.

ఇదిలా ఉంటే ఈ ఖండాతర క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నిజానికి అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ విజృంభించిన కారనంగా వాయిదా పడింది. ఇక భారత్‌ అగ్ని – 1ను 2012లో తొలిసారి విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.

Also Read: Paytm IPO: పేటీఎం ఐపీఓకు రంగం సిద్ధం.. ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ డేట్ వచ్చేసింది.. పూర్తి వివరాలు మీకోసం?

Konaseema: కొనసీమలో కొత్త కళ..ఆ రైతులకు ముందే వచ్చిన పండగ

Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..