Coronavirus India: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
Covid-19 Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా
Covid-19 Updates in India: భారత్‌లో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. బుధవారం కూడా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశవ్యాప్తంగా 41,195 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరు రోజుల తర్వాత కేసులు 41వేలు దాటాయి. దీంతోపాటు 490 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతోపాటు రికవరీ రేటు 97.45 శాతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,77,706 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,29,669 కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి నుంచి 39,069 మంది బాధితులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం 3,12,60,050 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 53 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా.. కరోనా ప్రారంభం నాటినుంచి ఆగస్టు 11 బుధవారం వరకు దేశంలో ఇప్పటివరకు మొత్తం 48,73,70,196 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 21,24,953 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.
Also Read: