Sonia Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎలెక్షన్ కమిటీ..ప్రతిపాదనకు సోనియా గాంధీ ఆమోదం..
యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లాలూ, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా, ఆర్.పీ.ఎన్. సింగ్ తదితరులతో కూడిన ఈ కమిటీకి పార్టీ...
యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లాలూ, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా, ఆర్.పీ.ఎన్. సింగ్ తదితరులతో కూడిన ఈ కమిటీకి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదముద్ర వేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేస్తూ.. ఈ కమిటీలో మరో 38 మంది సభ్యులు కూడా ఉంటారన్నారు. జాతీయ అధ్యక్షులు గానీ..ఏఐసీసీ చైర్ పర్సన్స్ గానీ. యూపీ ఫ్రంటల్ సంస్థల హెడ్స్ లేదా..ఆ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఇందులో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉంటారన్నారు. యూపీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, మొహిసినా కిద్వాయ్, ఖుర్షీద్, నిర్మల్ ఖాత్రి, ప్రమోద్ తివారీ, పి.ఎల్.పునియా, వివేక్ బన్సాల్, మాజీ ఎంపీలు రాజేష్ మిశ్రా, రాజారామ్ పాల్ ప్రభృతులతో ఈ పానెల్ ఏర్పాటైందన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు ఇమ్రాన్ మసూద్, బ్రీజ్ లాల్ ఖాబ్రీ, జితేంద్ర బాఘేల్ తదితరులు కూడా ఈ ఎలెక్షన్ కమిటీలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నారు.
పార్టీ నేత ప్రియాంక గాంధీ నేతృత్వంలో తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని, బీజేపీని ఓడించి మూడు దశాబ్దాల తరువాత మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని అజయ్ కుమార్ లాలూ తెలిపారు. బీజేపీ గద్దె దిగు అనే నినాదంతో ఈ నెల 9 న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. 403 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఈ ప్రొటెస్ట్ నిర్వహించారు. ప్రియాంక గాంధీ గత నెలలో లక్నోను సందర్శించి రాష్ట్రంలో బీజేపీని ఓడించడానికి కేడర్ అంతా సమైక్యంగా కృషి చేయాలనీ కోరారు. ఇప్పటికే ఆమె ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి నెలలో ముగియనుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : షూటింగ్స్ లో డేంజర్ బెల్స్.. స్టన్నింగ్ స్టంట్ చేసేప్పుడు సీన్ రివర్స్ అయితే…?:Danger Bells In Shooting Live video.
బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.
రాంగ్ రూటులో వచ్చిన మహిళ..అంతలోనే ప్రమాదం.!రెప్పపాటులో రెండు కాళ్ళు పోయాయి..: Traffic Rules Video.