India Corona Cases: ఇండియా కరోనా బులిటెన్.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

India Corona Cases: ఇండియా కరోనా బులిటెన్.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.!
India Corona Updates
Follow us

|

Updated on: Jun 11, 2021 | 10:02 AM

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కి చేరింది. ఇందులో 11,21,671 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 1,34,580 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,77,90,073కి చేరింది.

అటు నిన్న 3403 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,63,079కి చేరుకుంది. ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజులో 20,44,131 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు మొత్తంగా 37,42,42,384 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. అటు ఇప్పటిదాకా 24,60,85,649 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

 ‘కోవిన్ పోర్టల్’ హ్యాక్ అయిందా.? అసలు నిజం ఏంటి.!

భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ‘కోవిన్ పోర్టల్’ హ్యంక్ అయిందంటూ ‘డార్క్ వెబ్ క్రిమినల్ ఇంటలిజెన్స్’ కొన్ని గంటల క్రితం ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని.. పూర్తిగా నిరాధారమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. కోవిన్ యాప్, పోర్టల్‌లో వ్యాక్సినేషన్ డేటాతో పాటు నమోదు చేసుకున్నవారి డీటయిల్స్ పూర్తి సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, టీకా అడ్మినిస్ట్రేషన్ (కో-విన్) ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..