Ladakh Row: సరిహద్దుల్లో కమ్మకుంటున్న యుద్ధ మేఘాలు.. భారీగా మోహరించిన ఇరు దేశాల సైనికులు..
తూర్పు లద్దాఖ్ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. లద్దాఖ్‌లో మళ్లీ అలజడి సృష్టిస్తోంది డ్రాగన్.. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని ఏర్పాటు చేసినట్టు భారత ఆర్మీ.

తూర్పు లద్దాఖ్ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. లద్దాఖ్‌లో మళ్లీ అలజడి సృష్టిస్తోంది డ్రాగన్.. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని ఏర్పాటు చేసినట్టు భారత ఆర్మీ. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై భారత్- చైనాలు తమ పట్టును బిగించాయి. చైనా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు నిపుణులు. సైనిక కార్యకలాపాలను పెంచడం. మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే రెండు వైపుల నుండి నిరంతర పర్యవేక్షణపై నాలుగు వారాల చర్చలు జరిగినప్పటికీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పారు.
హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇరువైపులా క్లిష్ట పరిస్థితుల కారణంగా సైనిక చర్చలు ప్రస్తుతం విజయవంతం అయ్యే అవకాశం లేదని..ఈ సందర్భంలో పై నుండి జోక్యం చేసుకోవడం మాత్రమే 18 నెలల సరిహద్దు సంక్షోభాన్ని పరిష్కరించగలదని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యకు ప్రతిస్పందనగా సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాలు ఉన్నాయని.. ఎలాంటి విపత్తు కార్యకలాపాలను ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా తీసుకున్నట్లుగా మరో అధికారి వెల్లడించారు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి
డ్రాగన్ పదేపదే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూ నీతులు వల్లిస్తూనే.. ఎల్‌ఏసీ దగ్గర భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తోంది.
ఈ సంవత్సరం LACపై ఘర్షణ పాయింట్లపై రెండు రౌండ్ల చర్చల తర్వాత కూడా ఇరు దేశాల సైన్యాలను మోహరించాయి. ఇప్పటికే అధునాతన ఆయుధాలను కలిగి ఉన్న 50 నుండి 60 వేల మంది సైనికులను సరిహద్దు ప్రాంతాల్లో దింపారు. గత వారం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ బీజింగ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్చలలో పాల్గొన్నప్పటికీ “LACపై తన వాదనలను బలోపేతం చేయడానికి అదనపు.. వ్యూహాత్మక చర్య” తీసుకుంటోందని పేర్కొంది.
ఉత్తర ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా (రిటైర్డ్) మాట్లాడుతూ ఇరువైపులా పరిస్థితి మరింత దిగజారిందని.. 13వ రౌండ్ సైనిక స్థాయి చర్చల తర్వాత భారతదేశం- చైనాలు చేసిన ప్రకటనలు సారూప్యతను కనుగొనడంలో స్పష్టమైన సూచన అని అన్నారు. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి రాజకీయ, దౌత్య స్థాయిలో ప్రయత్నాలు అవసరం. అయితే, ఈ దశలో ఏ దేశమైనా చొరవ తీసుకోవడానికి సుముఖంగా ఉందో లేదో అనిశ్చితంగా ఉంది.
13వ రౌండ్ చర్చల ఫలితం
అక్టోబర్ 10న జరిగిన 13వ రౌండ్ చర్చల్లో భారత సైన్యం ఇచ్చిన సూచనలతో PLA ఏకీభవించలేదు. మిగిలిన ప్రాంతాలను పరిష్కరించేందుకు తాము నిర్మాణాత్మక సూచనలు చేశామని.. అయితే చైనా అంగీకరించలేదని.. దార్శనికతతో కూడిన ప్రతిపాదనతో ముందుకు రాలేదని భారత సైన్యం పేర్కొంది. మరోవైపు భారత్ అవాస్తవ, అసమంజసమైన డిమాండ్లను చేస్తోందని వక్ర బుద్ది కలిగిన చైనా ఆరోపించింది.
అక్టోబర్ 10 చర్చల తరువాత, PLA LAC అంతటా ట్యాంక్ డ్రిల్ నిర్వహించింది. భారత సైన్యం తన వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి గత వారం తూర్పు లడఖ్‌లో వైమానిక విన్యాసాన్ని ప్రారంభించింది. “ఇరువైపులా కఠినమైన వైఖరి ఉంది. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి” అని చైనా నుండి నిపుణుడు, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ SL నరసింహన్ (రిటైర్డ్) అన్నారు. సైనిక చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నది వాస్తవం అని నరసింహ తెలిపారు.
ప్రతిష్టంభన ఇంకా వీడలేదు
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే అక్టోబర్ 9న లడఖ్ థియేటర్‌లో ఉండాలనుకుంటే భారత సైన్యం కూడా అక్కడే ఉందని చెప్పారు. లడఖ్ సెక్టార్‌లో, హాట్ స్ప్రింగ్స్ , డెప్సాంగ్ వద్ద ప్రతిష్టంభనను పరిష్కరించాల్సి ఉంది. హాట్ స్ప్రింగ్స్ (పెట్రోలింగ్ పాయింట్ (PP-15) వద్ద భారత సైన్యం యొక్క పెట్రోలింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: నాతోపాటు నా బుజ్జి బొమ్మకు కూడా టెంపరేచర్ చెక్ చేయండి.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో..
PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..
