Independence Day: భరతమాత విముక్తి కోసం పోరాడిన వీర నారీమణులు.. చరిత్రలో మరుగున పడిన వీరి గురించి తెలుసుకుందాం
Women Freedom Fighters: మహిళలు... అనేక చారిత్రక ఘట్టాల్లో, మన దేశ స్వతంత్ర పోరాటంలో, భారత రాజ్యాంగ రూపకల్పన అనేక మంది అద్భుతమైన సాహసాలను.. పురుషులతో సమానంగా ప్రదర్శించారు. కానీ చరిత్ర మరుగున పడిపోయారు..
Women Freedom Fighters: మహిళలు… అనేక చారిత్రక ఘట్టాల్లో, మన దేశ స్వతంత్ర పోరాటంలో, భారత రాజ్యాంగ రూపకల్పన అనేక మంది అద్భుతమైన సాహసాలను.. పురుషులతో సమానంగా ప్రదర్శించారు. కానీ చరిత్ర మరుగున పడిపోయారు…ముఖ్యంగా బ్రిటిష్ వారి ఏలుబడి నుంచి.. బానిస సంకెళ్ళను తెంచి… భరతమాత దాస్య విముక్తి కోసం పోరాడిన మహిళలు.. ఎందరో… మహిళలు…ఆరోజుల్లో… బయటకు రావడమే అరుదైన దృశ్యం… అటువంటి కాలంలో భరత మాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వాత్రంత్ర పోరాటంలో పాల్గొని ఎందరికో స్పూర్తిగా నిలిచారు.. పోరాటానికి ఊపిరి పోశారు. స్వాత్రంత్ర పోరాటం చేసిన వీరులు అనగానే.. వెంటనే, గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నేతాజీ అని గుర్తుకు తెచ్చుకుంటాం.. కానీ భరత మాత దాస్య విముక్తి కోసం నాటి స్త్రీలు కూడా స్వాత్రంత్ర పోరాటం చేస్తూ ఆ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు.
స్వాత్రంత్ర కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. ధైర్యంలో నేటి తరం యువతకు కూడా స్పూర్తిగా నిలిచే వీర వనిత ఝాన్సీ లక్ష్మి భాయి. బ్రిటిష్ ని ఎదిరించి నిలిచిన ధీర వనిత.. ఇప్పటికీ అసామాన్య దైర్య సాహసాలను ప్రదర్శించిన వారిని ఝాన్సి లక్ష్మి బాయి తోనే పోలుస్తారు.
స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ.
మన తెలుగింటి ఆడబిడ్డ.. సరోజినీ నాయుడు.. . భారత స్వతంత్రోద్యమంలో చురుకుగా పనిచేయడమే కాదు.. స్త్రీల విద్య కోసం తన జీవితమంతా కృషి చేశారు. తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవితలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు.
దేశమాతకోసం స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆడపిల్ల అంటే పెండ్లి చేసుకుని పిల్లల్ని కని ఇంటిలో పడివుండే పరిస్థితి ఆనాటి సమాజానిది. బాల్యంలోనే భర్తను కోల్పోయినా దైర్యం కోల్పోలేదు.. దేశమాత కోసం స్వతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్భామ్మ… సహాయ నిరాకరణోద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్న ధీశాలి.
నైటింగేల్ ఆఫ్ ఇండియా స్వాత్రంత్ర సమరయోధురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్. మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా పేరుపొందారు.
సుభాష్ చంద్రబోస్ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ భారత స్వాత్రంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు.
రాజ్‌కుమారి అమృత్ కౌర్ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జన్మించారు. భారత దేశ తొలి ఆరోగ్యమంత్రి. స్వాతంత్య్రోద్యమంలో కదంతొక్కిన మహిళ.
కేరళలోని పాల్‌ఘాట్ ప్రాంతానికి చెందిన అమ్ము స్వామినాథన్, గుజరాత్ కు చెందిన హన్స జివరాజ్ మెహతాది, భారత దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన విజయలక్ష్మీ పండిట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సన్నిహితురాలు లీలా రాయ్, మహాత్మాగాంధీ ‘తూఫాన్’గా పిలిచే మాలతీదేవి స్వాతంత్య్రసమరయోధురాలు. రాజ్యాంగ సభ సభ్యురాలు మాలతీ చౌదరి, బ్రిటిష్ విద్యావిధానాన్ని బహిష్కరిం చాలన్న పిలుపునందుకొని కాలేజీ చదువుని వదిలివచ్చి ఉద్యమంలో చేరిన రేణుకా రాయ్, మాతా శిశుల ఆరోగ్యంగా వుంటేనే దేశం అభివృద్ది చెందుతుంది అని నమ్మే వ్యక్తి గుంటూరుకు చెందిన వైద్యురాలు కొమర్రాజు అచ్చమాంబ, సుచేతా కృపలానీ, బేగం ఐజాజ్ రసూల్ ,పూర్ణిమా బెనర్జీ వంటి వారితో పాటు అరుణ అసఫ్ అలీ స్వాతంత్రోద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు.
అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేకమంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్ రాణి బేగం హజరత్ ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు.
స్త్రీలపై అన్నివిధాల ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే భరత మాత దాస్య విముక్తి కోసం ఎన్నో త్యాగాలను చేసి… దేశ భవిష్యత్తుకి పునాదులు వేసిన స్త్రీలను స్మరించుకోవడం మన ధర్మం. కానీ ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలకు కూడా అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న మహిళల పేర్లు తెలియదు అన్నది వాస్తవం.
Also Read: శ్రీవారి సన్నిధిలో త్వరలో అకాడమీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన పీవీ సింధు