Currency Notes Exchange: మీ దగ్గర చిరిగిన, కాలిపోయిన నోట్లు ఉన్నాయా? మరేం పర్వాలేదు ఇలా మార్చుకోండి..!
భారతదేశంలో ద్రవ్య పరపతి వ్యవహారం అంతా ఆర్బీఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ, చెలామణి, మార్పు వంటి అన్ని విషయాలు ఆర్బీఐ పర్యవేక్షణలోనే జరుగుతుంది.

భారతదేశంలో ద్రవ్య పరపతి వ్యవహారం అంతా ఆర్బీఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ, చెలామణి, మార్పు వంటి అన్ని విషయాలు ఆర్బీఐ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే, నకిలీ నోట్ల చెలామణి విపరీతంగా పెరిగిపోవడంతో.. 2016లో నోట్ల రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ. అయితే, ఆ సమయంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వం, ఆర్బీఐ కాస్త ఊరటనిస్తూ తమ వద్దనున్న పాత నోట్లను నిర్ణీత గడువులోగా మార్చుకోవచ్చని సూచించింది. ఆ మేరకు చాలా మంది ప్రజలు తమ వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకున్నారు. కొందరు మార్చుకోలేదు అది వేరే విషయం.
ఈ అంశం ఇలా ఉంటే.. చాలా మంది వద్ద పాత పెద్ద నోట్లు(వెయ్యి నోట్లు) ఉంటాయో లేదో తెలియని కానీ, చిరిగిన నోట్లు, పాతబడిన నోట్లు, సగం కాలిన నోట్లు మాత్రం ఉంటాయని చెప్పొచ్చు. అయితే, వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చిత్తుపేపర్ల మాదిరిగా పడేస్తారు కొందరు. మరి ఈ పాత, చిరిగిన, కాలిన నోట్లను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. నోట్లే కాదు, నాణేలను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు సంబంధించి తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ఇందులో మీరు మీ పాత నోట్లు, నాణేలు ఇచ్చి కొత్త నోట్లు, నాణేలను పొందుతారు. ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ట్వీట్ చేసింది. మీ వద్ద ఉన్న పాత, చిరిగిపోయిన నోట్లను మార్చుకోవాలనుకుంటే.. దగ్గరలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ నోట్లు, నాణేలను సులభంగా మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం.. మీ దగ్గర పాత, చిరిగిపోయిన నోట్లు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ఏదైనా శాఖకి వెళ్లి నోట్లను మార్చుకోవచ్చు. ఇలాంటి నోట్లని మార్చుకోవడానికి ఎవరైనా బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే దీనిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. అయితే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కరెన్సీ నోటు పరిస్థితి మరీ దారుణంగా ఉంటే మాత్రం.. దాని విలువ తగ్గుతుంది.




ఆర్బీఐ ప్రకారం.. చిరిగిన నోటులో కొంత భాగం పోయినా, రెండు ముక్కల కంటే ఎక్కువ ముక్కలైనప్పుడు, దానిని అతికించి ఉన్న నోట్లని మార్చుకోవచ్చు. ఇక కరెన్సీ నోటులో సంతకం, అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ లేకుంటే అలాంటి నోట్లను మార్చుకోవడానికి వీలు పడదు. ఇక, బాగా కాలిపోయిన నోట్లను బ్యాంకులు తీసుకోవు. వీటిని ఆర్బీఐ ఇష్యూ కార్యాలయంలో మార్చుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..