బాబోయ్‌.. ఇది బాహుబలి రైల్వే స్టేషన్ అనాల్సిందే..! ఇక్కడి ప్లాట్‌ఫాంల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు..ఎక్కడంటే..

నేడు ఈ రైల్వే స్టేషన్‌లో అన్ని భద్రతప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్‌లో మ్యూజియం కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్‌కు గ్రీన్ రైల్వే స్టేషన్ అనే ట్యాగ్ వచ్చింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్‌ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.

బాబోయ్‌.. ఇది బాహుబలి రైల్వే స్టేషన్ అనాల్సిందే..! ఇక్కడి ప్లాట్‌ఫాంల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు..ఎక్కడంటే..
indian biggest railway station
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 24, 2024 | 6:30 PM

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగి ఉన్న దేశాల్లో మనదేశం కూడా ఒకటి. 66,687 కిలోమీటర్ల విస్తరణంతో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది ఇండియన్‌ రైల్వే. మనదేశంలో రైల్వే ప్రయాణం చాలా చౌక. అందుకే రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సదుపాయాలను అందిస్తోంది. అయితే రైల్వే స్టేషన్‌ల విషయంలో కొన్ని స్టేషన్‌లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడూ భారీగా రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైల్వే స్టేషన్‌లో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇసుకేస్తే రాలనంత మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇది మన దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా పేరొందింది. ఇంతకీ ఆ జంక్షన్ ఏది..? దాని ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా 7,325 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ వేలాది రైళ్లు ప్రయాణిస్తాయి. అయితే దేశంలో అతిపెద్ద, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏక్కడ ఉంది..? అత్యధిక స్టేషన్లు ఏ రైల్వే స్టేషన్‌లో ఉన్నాయో మీకు తెలుసా? దేశంలో అతిపెద్ద, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ రాజధాని ఢిల్లీలో లేదా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లేదు, దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా రైల్వే స్టేషన్. ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా పేరుగాంచింది. ఈ రైల్వే స్టేషన్‌లో 23 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఈ స్టేషన్ హౌరా జంక్షన్. దీనిని దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా పిలుస్తారు. హౌరా జంక్షన్‌లో ఐదు, పది ప్లాట్‌ఫారమ్‌లు కాదు ఏకంగా 23 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్‌లో మొత్తం 23 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. 26 రైలు మార్గాలతో ఈ రైల్వే స్టేషన్‌లో ఏకకాలంలో 23 రైళ్లు రాకపోకలు సాగించగలవు. మీడియా నివేదికల ప్రకారం, హౌరా రైల్వే స్టేషన్‌కు ప్రతిరోజూ కనీసం 300 రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే ప్లాట్‌ఫారమ్‌ను దాటడానికి ప్రజలు వంతెన మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని విధంగా ఈ స్టేషన్‌ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

హౌరా రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో రూపొందించారు. దీని నిర్మాణం 1850లో ప్రారంభమైంది. 1854 ఆగస్టు 15న మొదటి రైలు ఈ రైల్వే స్టేషన్ నుండి నడిచింది. హౌరా, హుగ్లీ మధ్య మొదటిసారి రైలు నడిచింది. నేడు ఈ రైల్వే స్టేషన్‌లో అన్ని భద్రతప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్‌లో మ్యూజియం కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్‌కు గ్రీన్ రైల్వే స్టేషన్ అనే ట్యాగ్ వచ్చింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్‌ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.

హౌరా రైల్వే స్టేషన్‌ను అత్యంత రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌గా కూడా పిలుస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రతిరోజూ 10.8 లక్షల మందికి పైగా రైల్వే ప్రయాణికులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎర్ర-ఇటుక హౌరా రైల్వే స్టేషన్ అనేది సాంప్రదాయ వాస్తుశిల్పం, వలస, స్థానిక శైలుల కలయికతో కూడిన అద్భుతమైన భవనం. ఇకపోతే,  పశ్చిమ బెంగాల్‌లోనే 20 ప్లాట్‌ఫారమ్‌లతో భారతదేశంలో రెండవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని సీల్డా రైల్వే స్టేషన్ భారతదేశంలో రెండవ అతిపెద్ద రైల్వే స్టేషన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..