Blue Color Snake Video: అరుదైన నీలిరంగు పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఆ వీడియో చూస్తే..
నిజానికి ఇలాంటి పాములు చాలా అరుదుగా ఉంటాయి. చాలామంది ఇలాంటి అరుదైన పాములు, జంతుజీవాలను రక్షించి పరిశోధన శాలల్లో ప్రత్యేకంగా పెంచుతుంటారు. అంతేకాదు.. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఇలాంటి నీలి రండు వైపర్స్ ను పెంచేందుకు అనుమతులను ఇస్తుంటాయని సమాచారం.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నెటిజన్లు సైతం ఇలాంటి వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు. పాములు, జంతువుల జీవనశైలి, వేటకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా లైకులు, షేర్లు చేస్తుంటారు. ఇకపోతే, కొత్త కొత్త జాతులకు సంబంధించిన పాములు ఇతర జంతువులను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాములకు సంబంధించిన ఎలాంటి వీడియోలైనా షేర్ చేసిన వెంటనే ఇంటర్‌నెట్‌లో దూసుకెళ్తుంటాయి. అయితే ఇటీవలే ఒక రెడ్‌కలర్‌లో ఉన్న కింగ్‌కోబ్రా వీడియో వైరల్ కావటం మనం చూశాము. తాజాగా అలాంటిదే మరో రంగులో అరుదైన పాము కనిపించింది.
వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు బేబీ ఫిట్ వైపర్స్‌తో ఒక వ్యక్తి ఆడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అవి పాములే అయినప్పటికీ చూసేందుకు మాత్రం ఎంతో అందంగా బ్లూ కలర్ లో అరుదుగా కనిపిస్తున్నాయి. వీడియోలో ఉన్న ఆ వ్యక్తి వాటిని చూపెడుతూ వాటికి సంబంధించిన సమాచారాన్ని వివరిస్తున్నాడు.. నిజానికి ఇలాంటి పాములు చాలా అరుదుగా ఉంటాయి. చాలామంది ఇలాంటి అరుదైన పాములు, జంతుజీవాలను రక్షించి పరిశోధన శాలల్లో ప్రత్యేకంగా పెంచుతుంటారు. అంతేకాదు.. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఇలాంటి నీలి రండు వైపర్స్ ను పెంచేందుకు అనుమతులను ఇస్తుంటాయని సమాచారం.
ఈ వీడియో చూడండి..
ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న వీడియో షార్ట్ ను స్టోన్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. కాగా, వీడియోని కొన్ని లక్షల మంది వీక్షించారు. వేలాది మందికి పైగా లైక్ చేశారు. ఈ బేబీ పిట్ బ్లూ కలర్ వైపర్స్ గురించి తెలుసుకోవడానికి చాలామంది కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..