Viral Video: ఇకపై నో టెన్షన్.. దోమల్ని చంపేందుకు ‘ఐరన్ డోమ్’ వచ్చేసిందిగా..

దేశ వ్యాప్తంగా డెంగీ కేసులు ఎక్కువై పోతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు డెంగీతో వణికిపోతున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దోమల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. వాటితో పెద్దగా ఫలితం ఉండటం లేదు. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో డెంగ్యూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్..

Viral Video: ఇకపై నో టెన్షన్.. దోమల్ని చంపేందుకు 'ఐరన్ డోమ్' వచ్చేసిందిగా..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 24, 2024 | 5:08 PM

దేశ వ్యాప్తంగా డెంగీ కేసులు ఎక్కువై పోతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు డెంగీతో వణికిపోతున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దోమల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. వాటితో పెద్దగా ఫలితం ఉండటం లేదు. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో డెంగ్యూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా ఏ ట్వీట్ చేసినా అది ఖచ్చితంగా వైరల్ అవడం ఖాయం. అలాగే ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. దోమల నియంత్రణకు మంచి సూచన ఇచ్చారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా దోమల్ని చంపేందుకు ఓ పరికరం వచ్చింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఉన్న పరికరాన్ని ‘ఐరన్ డోమ్‌’‌గా అభివర్ణించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఇంట్లో ఓ మెషిన్ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దాని నుంచి లేజర్ కిరణాలు వస్తున్నాయి. దోమల్ని చంపే ఓ మినియేచర్ క్యానస్ కనబడుతుంది. ఈ మెషిన్ చైనాకు సంబంధించినదిగా ఉంది. ఇందులో చిన్న సైజు యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లా కనబడుతున్న రాడార్ వ్యవస్థ ఉన్నట్టు ఉంది.

ఇది చుట్టు పక్కల ఎగిరే దోమల్ని గుర్తించి చంపేస్తుంది. ఇలా ఇది నిమిషాల వ్యవధిలోనే ఎన్నో దోమలను చంపింది. ప్రస్తుతం తాను కూడా ఇలాంటి మెషిన్ కొనడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆ మెషిన్ మన ఇంటికి ఐరన్ డోమ్‌లా పని చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..