Viral Video: అయ్య బాబోయ్ ఈ సొరకాయను చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు..

సొరకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. కూరగాయల్లో ఇది కూడా ఒకటి. అయితే సొరకాయను కేవలం కూరల్లానే కాకుండా జ్యూస్ తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ సొరకాయ అంటే అస్సలు ఇష్ట పడరు. ఇందులో చాలా వరకు నీటి శాతమే అధికంగా ఉంటుంది. సొరకాయ తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. సాధారణంగా సొరకాయలు చాలా పొడుగ్గా..

Viral Video: అయ్య బాబోయ్ ఈ సొరకాయను చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వక తప్పదు..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 24, 2024 | 4:50 PM

సొరకాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. కూరగాయల్లో ఇది కూడా ఒకటి. అయితే సొరకాయను కేవలం కూరల్లానే కాకుండా జ్యూస్ తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ సొరకాయ అంటే అస్సలు ఇష్ట పడరు. ఇందులో చాలా వరకు నీటి శాతమే అధికంగా ఉంటుంది. సొరకాయ తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. సాధారణంగా సొరకాయలు చాలా పొడుగ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సొరకాయ మాత్రం ఏకంగా మనిషి కంటే పొడుగ్గా ఉంది. ఓ వ్యక్తి తన పొలంలో పండిన సొరకాయను వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ సొరకాయకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియో సంగతి ఏంటో చూద్దాం.

ఈ వీడియోలో పొడవాటి సొరకాయ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఈ సొరకాయ 5 నుంచి 6 అడుగులు ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సొరకాయ పండించడంలో రైతు చాలా కష్ట పడి ఉండాలి. ‘హ్యాపీ గార్డెన్ హ్యాపీ లైఫ్’ అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఎక్కడ ఈ సొరకాయను పండిచారు అనేది తెలియ లేదు. ఇప్పటి వరకూ ఈ సొరకాయ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఎంతో ఫన్నీగా రియాక్ట్ అవుతూ.. కామెంట్లు చేస్తున్నారు.

‘ఇంత పెద్ద సొరకాయను నా లైఫ్‌లో చూడటం ఇదే మొదటి సారి’.. ‘ఇది నా కంటే పొడుగ్గా ఉన్నట్టు ఉంది’.. ‘అసలు ఇంత పెద్ద సొరకాయ ఉంటుందా’.. ‘ఇది ఒక్కటి వండితే చాలు.. ఊరందరికీ భోజనం సరిపోతుంది’.. ‘నిజంగానే ఇంత పెద్ద సొరకాయను పండించారా’.. అంటూ కామెంట్లతో పాటు ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..