Valentine’s Day: కుక్కలకు పెళ్లి.. ప్రేమికుల దినోత్సవ వేళ హిందూ సంస్థ వినూత్న నిరసన.. తాళి ఎవరు కట్టారంటే..
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ ఆ సక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా ఓ హిందూ సంస్థ వినూత్న నిరసన తెలిపింది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ ఆ సక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా ఓ హిందూ సంస్థ వినూత్న నిరసన తెలిపింది. తమిళనాడులోని శివగంగలో హిందూ సంస్థ కుక్కలకు వివాహా వేడుకలను నిర్వహించింది. శివగంగలో హిందూ మున్నాని సంస్థ వాలెంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించింది. ఇది భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైన దినమని.. అలాంటి వేడుకను వ్యతిరేకించాలని పేర్కొంది. రైట్‌వింగ్‌కు చెందిన సభ్యులు ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేయడం కనిపిస్తుందని.. కానీ.. ఇలాంటి వినూత్న నిరసన ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు.
హిందూ మున్నాని కార్యకర్తలు సోమవారం రెండు కుక్కలను తీసుకొచ్చి వాటికి దుస్తులు ధరించి.. పూలమాలలు వేశారు. అనంతరం కుక్కలకు పెళ్లి జరిపించారు. సంస్థ కార్యకర్తల్లో ఒకరు.. ఓ శునకానికి తాళి కట్టినట్లుగా ముడి వేశారు.

Dogs Marraige
అయితే, ప్రేమికుల రోజున బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు అనుచితంగా ప్రవర్తించారని, దీన్ని వ్యతిరేకిస్తూ కుక్కలకు పెళ్లిళ్లు జరిపించామని హిందూ మున్నానీ కార్యకర్తలు పేర్కొన్నారు.




ఇదిలాఉంటే.. ముందుగా సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. వాలెంటైన్స్ డేను.. కౌ హగ్ డేగా ప్రకటించి.. ఆ తర్వాత విరమించుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. పలు ప్రాంతాల్లో హిందూ కార్యకర్తలు.. కౌహగ్ డేను నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..