Love Jihad Law: హిందూ అమ్మాయిని హిందూ అబ్బాయి మోసగించినా లవ్ జిహాదే.. చట్టం తీసుకురానున్న..

Love Jihad Law: లవ్ జిహాద్‌కు సరికొత్త నిర్వచనమిచ్చారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. హిందూ అమ్మాయిని అదే మతానికి చెందిన అబ్బాయి అబద్ధాలు చెప్పి మోసగిస్తే..దాన్ని కూడా లవ్ జిహాద్‌గానే పరిగణిస్తామని ఆయన స్పష్టంచేశారు.

Love Jihad Law: హిందూ అమ్మాయిని హిందూ అబ్బాయి మోసగించినా లవ్ జిహాదే.. చట్టం తీసుకురానున్న..
Himanta Biswa Sarma
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 11, 2021 | 8:38 AM

లవ్ జిహాద్‌కు సరికొత్త నిర్వచనమిచ్చారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. హిందూ అమ్మాయిని అదే మతానికి చెందిన అబ్బాయి అబద్ధాలు చెప్పి మోసగిస్తే..దాన్ని కూడా లవ్ జిహాద్‌గానే పరిగణిస్తామని ఆయన స్పష్టంచేశారు. దీన్ని కట్టడి చేసేందుకు అసోం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. మహిళలను హిందువు లేదా ముస్లీం ఎవరు మోసగించినా తమ ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన స్పష్టంచేశారు. మహిళలను మోసగించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. మా సోదరీమణుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అందుకే రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం తీసుకొస్తామని..దీనిపై రాష్ట్ర కేబినెట్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. పశు సంరక్షణ, జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల విధానాలకు సంబంధించిన చట్టాలను తీసుకురావాలని అసోం ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది.

హిందుత్వ జీవన విధానమన్న సీఎం హిమంత బిశ్వ శర్మ..ముస్లీం, క్రైస్తవం సహా చాలా మతాలు హిందుత్వ విధానం నుంచే వచ్చాయని వ్యాఖ్యానించారు. హిందుత్వం 5 వేల సంవత్సరాలకు ముందు ప్రారంభమయ్యిందన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందుత్వను ఆపడం ఎవరితరమూ కాదని వ్యాఖ్యానించారు.

అటు అసోంలో కరోనా ప్రభావంపై మాట్లాడుతూ…రాష్ట్రంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదుకాలేదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌‌ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సమీక్షించనున్నట్లు వెల్లడించారు. నాగలాండ్, మిజోరం రాష్ట్రాలతో నెలకొన్న సరిహద్దు వివాదాలపై స్పందించిన ఆయన..తమ రాష్ట్ర సరిహద్దుల పరిరక్షణకు పోలీసులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దు వివాదాలపై పొరుగు రాష్ట్రాలతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధమన్నారు. అయితే తమ రాష్ట్ర భూభాగాన్ని అక్రమించుకోవాలని చూస్తే సహించబోమన్నారు.

Also Read..

డేంజర్ యాక్సిడెంట్..! గాల్లో పల్టీలు కొట్టిన భార్యా భర్తలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ