Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana: సోమవారం శోభాయాత్రకు వీహెచ్‌పీ పిలుపు.. అనుమతి లేదన్న సీఎం.. హర్యానాలో మళ్లీ హై టైన్షన్‌

హర్యానా లోని నూహ్‌లో మళ్లీ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. సోమవారం విశ్వహిందూపరిషత్‌ చేపట్టిన బ్రజ్‌మండల్‌ శోభాయాత్రకు ప్రభుత్వం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికి యాత్రను చేపడుతామని వీహెచ్‌పీ నేతలు ప్రకటించడంతో అలర్ట్‌ ప్రకటించారు. జులై 31న నూహ్‌లో చెలరేగిన హింసలో ఇద్దర పోలీసులు, ఓ మతగురువుతో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నూహ్‌లో చెలరేగిన హింస ఢిల్లీ శివార్ల లోని గుర్‌గ్రామ్‌ వరకు పాకింది. అప్పుడు వీహెచ్‌పీ చేపట్టిన బ్రజ్‌మండల్‌ శోభాయాత్ర లోనే గొడవలు చెలరేగాయి.

Haryana: సోమవారం శోభాయాత్రకు వీహెచ్‌పీ పిలుపు.. అనుమతి లేదన్న సీఎం.. హర్యానాలో మళ్లీ హై టైన్షన్‌
High Alert In Haryanas Nuh
Follow us
Basha Shek

|

Updated on: Aug 27, 2023 | 10:34 PM

హర్యానా లోని నూహ్‌లో మళ్లీ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. సోమవారం విశ్వహిందూపరిషత్‌ చేపట్టిన బ్రజ్‌మండల్‌ శోభాయాత్రకు ప్రభుత్వం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికి యాత్రను చేపడుతామని వీహెచ్‌పీ నేతలు ప్రకటించడంతో అలర్ట్‌ ప్రకటించారు. జులై 31న నూహ్‌లో చెలరేగిన హింసలో ఇద్దర పోలీసులు, ఓ మతగురువుతో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నూహ్‌లో చెలరేగిన హింస ఢిల్లీ శివార్ల లోని గుర్‌గ్రామ్‌ వరకు పాకింది. అప్పుడు వీహెచ్‌పీ చేపట్టిన బ్రజ్‌మండల్‌ శోభాయాత్ర లోనే గొడవలు చెలరేగాయి. దీంతో సోమవారం ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీ శివార్లలో జీ-20 సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ర్యాలీ కారణంగా శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే మొబైల్‌ , ఇంటర్నెట్‌ సేవలు.. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం

జలఅభిషేక్‌ యాత్ర హిందువులకు తీర్థయాత్ర అని , దానికి పోలీసుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు వీహెచ్‌పీ నేతలు. నూహ్‌లో ఇప్పటికే మొబైల్‌ , ఇంటర్నెట్‌ సేవలు,బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై హర్యానా ప్రభుత్వం నిషేధం విధించింది. సోమవారం వీహెచ్‌పీ ర్యాలీలో భారీ హింస చెలరేగుతుందని కొంతమంది సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతో ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. నూహ్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. హర్యానా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. నూహ్‌ జిల్లాలో 144 సెక్షన్‌ కూడా విధించారు.

ఇవి కూడా చదవండి

ముందు జాగ్రత్తగానే…

‘ నెలరోజుల క్రితం జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు యాత్రకు అనుమతి ఇవ్వలేదు.. యాత్రకు బదులుగా జనం స్థానిక మందిరాల్లో జలాభిషేకం చేయాలి. ఎక్కడి ప్రజలు అక్కడే పూజలు చేయాలి. యాత్ర తీస్తే మళ్లీ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా యాత్రకు అనుమతి ఇవ్వలేదు’ అని హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ తెలిపారు. అయితే యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని , ఎవరు అడ్డుకున్నప్పటికి మూడు ప్రదేశాల్లో జలాభిషేకం జరిగితీరుతుందని ప్రకటించారు వీహెచ్‌పీ సీనియర్‌ నేత అలోక్‌కుమార్‌. ఎట్టి పరిస్థితుల్లో యాత్ర జరుగుతుందన్నారు యాత్రకు నేతృత్వం వహిస్తున్న అలోక్‌కుమార్‌. ‘శ్రావణంలో ఆఖరి సోమవారం… తప్పకుండా యాత్రను నిర్వహిస్తాం.. జీ-20 సమావేశాలు జరుగుతున్న విషయం మాకు తెలుసు.. 27 మంది దేశాధినేతలు వచ్చినట్టు తెలుసు..సమస్యాత్మక ప్రాంతమని కూడా తెలుసు.. అందుకే యాత్రను చిన్న స్థాయిలో నిర్వహిస్తాం.. కాని యాత్రను నిలిపివేసే ప్రసక్తే లేదు. నేను స్వయంగా పాల్గొంటా.. ముందుగా చెప్పినట్టు నలహడ్‌ నుంచి శృంగార్‌ వరకు యాత్ర జరుగుతుంది. మూడు ప్రదేశాల్లో జలాభిషేకం చేస్తాం’ అన వీహెచ్‌పీ పేర్కొన్నారు. మరోవైపు బ్రజ్‌మండల్‌ శోభాయాత్ర కారణంగా నూహ్‌లో స్కూళ్లకు,విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

 డ్రోన్లతో నిఘా..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..