Khalistan Slogans: మెట్రోస్టేషన్లలో ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల అరాచకం..

Delhi Metro News: దేశరాజధాని ఢిల్లీని ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు టార్గెట్‌ చేశారు. ఖలిస్తాన్‌కు మద్దతుగా ఢిల్లీ లోని ఐదు మెట్రోస్టేషన్ల గోడలపై రాతలు రాశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీ మెట్రోస్టేషన్లలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల రాతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు పోలీసులు. 

Khalistan Slogans: మెట్రోస్టేషన్లలో ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల అరాచకం..
Pro Khalistan Messages
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 27, 2023 | 9:43 PM

దేశరాజధాని ఢిల్లీలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల అరాచకం మరోసారి బయటపడింది. జీ-20 సమావేశాలను అడ్డుకుంటామని పలుచోట్ల ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు మెట్రోస్టేషన్లపై స్లోగన్లు రాశారు. ఓవైపు జీ-20 సమావేశాల సందర్బంగా ఢిల్లీలో హైఅలర్ట్‌ ఉన్న సమయంలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు మెట్రోస్టేషన్లను టార్గెట్‌ చేయడం సంచలనం రేపింది. ఆస్ట్రేలియా,అమెరికా,కెనడా ,బ్రిటన్‌ లాంటి దేశాల్లో హిందూ ప్రార్థనా స్థలాలపై ఇలాంటి రాతలు రాస్తున్న ఖలిస్తాన్‌ వాదులు ఈసారి ఢిల్లీని టార్గెట్‌ చేయడం సంచలనం రేపుతోంది.

ఢిల్లీ బనేగా ఖలిస్తాన్‌.. ఖలిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ ఐదు మెట్రోస్టేషన్లపై రాశారు ఖలిస్తాన్‌ మద్దతుదారులు. పోలీసులు మెట్రోస్టేషన్లపై ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలను చెరిపేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

సెప్టెంబరులో ఢిల్లీలో జీ20 సమావేశం జరగబోతోంది..

వచ్చే నెలలోనే ఢిల్లీలో జీ20 సమావేశం జరగనున్న తరుణంలో గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాశారు. ఇది చూసిన ఢిల్లీ పోలీసులలో కలకలం రేగింది. సమాచారం అందిన వెంటనే ముందుగా గోడలను శుభ్రం చేశారు. ఢిల్లీ మెట్రోలోని శివాజీ పార్క్, నంగ్లోయ్, మాదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ విహార్ మహారాజా సూరజ్మల్ స్టేడియం స్టేషన్ల గోడలపై ఈ నినాదాలు రాశారు. ఇది కాకుండా, నంగ్లోయ్‌లోని సర్వోద్ బాల్ విద్యాలయం, పంజాబీ బాగ్‌లోని పాఠశాలలో నినాదాలు కనిపించాయి.

ఖలిస్తాన్, ఎస్‌ఎఫ్‌జేలకు మద్దతుగా..

ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్లు, పాఠశాలల గోడలపై ఖలిస్తాన్, ఎస్‌ఎఫ్‌జేలకు మద్దతుగా నినాదాలు రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై నంగ్లోయ్ మెట్రో స్టేషన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గోడలపై రాసిన నినాదాలను పోలీసులు చెరిపేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

కేసు నమోదు..

నంగ్లోయ్ మెట్రో స్టేషన్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 153, 153A, 505 కింద కేసు నమోదు చేయబడింది. దీంతో పాటు పరువునష్టం చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అదే సమయంలో, ఈ కేసు దర్యాప్తును ఇప్పుడు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ చేస్తుందని తెలిసింది.

ఢిల్లీ మెట్రోస్టేషన్లలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల రాతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు పోలీసులు.  సెప్టెంబర్‌ 9,10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరుగుతాయి. సమావేశాల సందర్భంగా ఇప్పటికే పలు నిషేధాజ్ఞలు విధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం