కుక్క కరిస్తే ప్రజలకు భారీ పరిహారం.. సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..
Dog Bite Compensation: దేశంలో రోజురోజుకు వీధి, పెంపుడు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఈ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కకాటు కేసులో బాధితులకు అండగా నిలిచేందుకు సరికొత్త పథకాన్ని తీసుకచ్చింది. ఆ పథకం ఏంటి.. దాని వల్ల జనాలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో రోజురోజుకు వీధి, పెంపుడు కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు హరియాణా ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేసింది. రాష్ట్రంలో కుక్కకాటుకు గురైన బాధితులకు ప్రభుత్వం తరపున పరిహారం అందించాలని నిర్ణయిచింది. ఈ మేరకు ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రజలు ఎవరైనా కుక్క కాటుకు గురైతే వారికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ పరివార్ సురక్ష యోజన(దయాళ్-II) కింద ప్రభుత్వం ఈ పరిహారాన్ని బాధితులకు అందజేస్తుంది.
అయితే కుక్కల దాడి వల్ల మనకు అయిన గాయాల తీవ్రతను బట్టి పరిహారం నిర్ణయిస్తారు. బాధితుడికి కుక్క కరిచినప్పుడు శరీరంపై వాటి పండిముద్రలు ఉంటే కనీసం రూ.10 వేలు, అదే గాటు శరీర లోపలకి వరకు వెళ్తే రూ.20వేలు వరకు పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పరిహారం పొందడానికి వీరు మాత్రమే అర్హులు
అయితే ఈ పరిహారం పొందడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. వీటి ఆధారంగానే బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. ఒక వ్యక్తి ఈ పథకం కింద పరిహారం పొందాలంటే అతన్ని వీధి/పెంపుడు కుక్క కరిచి ఉండాలి. ఆ దాడి కూడా ఇంట్లో కాకుండా బహిరంగా ప్రదేశంలో జరగి ఉండాలి. దాడి వల్ల ఆ వ్యక్తికి శారీరక గాయాలు అయి ఉండాలి. బాధితుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,80,000 లోపు ఉండాలి. అలాగే బాధితుడు రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన పరివార్ పెహచాన్ పత్ర నంబర్‌ను కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దాడి చేసేలా కుక్కలను ఎవరైనా ప్రేరేపిస్తే అలాంటి దాడులకు ఈ పరిహారం వర్తించదు. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన దాడులకు మాత్రమే ఈ పరిహారం వస్తుంది.
వయస్సును బట్టి పరిహారం అందజేత
మరోవిషయం ఏమిటంటే ఈ పరిహారం వివిధ వయస్సుల వారిని బట్టి వారికి వేర్వేరుగా ఉంటుందని తెలుస్తోంది. అప్పుడే పుట్టిన పశికందు నుంచి 12 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు బాధితులు అయితే వారికి రూ.లక్షవరకు పరిహారం అందవచ్చు.12 నుంచి 18 మధ్య వయస్సు వారకి రూ.2 లక్షలు, 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి రూ.3 లక్షలు, 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి రూ.5 లక్షలు, 45 సంవత్సరాలకు పై వయస్సు గల వ్యక్తులు బాధితులు అయితే వారిక రూ. 3 లక్షలు వరకు పరిహారం అందుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




