AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Election 2024: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దేశంలోని అత్యంత సంపన్న మహిళ.. ఏ పార్టీ నుంచంటే..?

దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Haryana Election 2024: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దేశంలోని అత్యంత సంపన్న మహిళ.. ఏ పార్టీ నుంచంటే..?
Savitri Jindal
Balaraju Goud
|

Updated on: Sep 06, 2024 | 2:45 PM

Share

దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హిస్సార్‌తో సహా 67 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. తాను బీజేపీలో చేరలేదని, కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదని సావిత్రి జిందాల్‌ గతంలోనే తెలిపారు. హర్యానా ఎన్నికల జాబితాలో, బీజేపీ ఆరోగ్య మంత్రి డాక్టర్ కమల్ గుప్తాను హిస్సార్ నుండి తమ అభ్యర్థిగా చేసింది. అతను వరుసగా రెండు సార్లు ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు.

ఈసారి సావిత్రి జిందాల్ హర్యానా ఎన్నికలకు హిస్సార్ నుండి బీజేపీ టిక్కెట్ అశించారు. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత, ఆమె గురువారం(సెప్టెంబర్ 5) ఉదయం జిందాల్ చౌక్‌లోని తన నివాసంలో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. మద్దతుదారులను కలిసిన తర్వాత ఆమె కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తానని చెప్పారు. ఆ తరువాత సావిత్రి జిందాల్ హిస్సార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు ఇచ్చే విషయంలో తన మద్దతుదారులే నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. తానూ బీజేపీ సభ్యత్వం తీసుకోలేదని, తన కుమారుడు, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్‌ కురుక్షేత్రలో, అలాగే రంజిత్ సింగ్ చౌతాలా కోసం హిస్సార్‌లో ప్రచారం చేశానని చెప్పారు. బీజేపీపై తనకు కోపం లేదని, పార్టీ సీనియర్ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించాలని, ఇది చాలా మంచిదని అన్నారు. ఇదే తన చివరి ఎన్నికలని, గెలవడం ద్వారా హిస్సార్‌లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని కోరుకుంటున్నానన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో హిస్సార్‌లో చాలా పనులు జరిగాయని, అయితే ఇంకా చాలా చేయాల్సి ఉందని ఆమె అన్నారు.

ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన సావిత్రి జిందాల్‌ ఆస్తి మొత్తం ఆగస్టు 21 నాటికి 39.5 బిలియన్‌ డాలర్లు. వీరి కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి. సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్‌ జిందాల్‌ ప్రస్తుతం కురుక్షేత్ర నుంచి పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..