AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi: వారణాసి కోర్టుకు జ్ఞానవాపి సర్వే రిపోర్ట్.. నివేదికలోని కీలక పాయింట్స్ ఇవే..!

Gyanvapi: జ్ఞానవాపి మసీదు, హిందూ టెంపుల్ వివాదం దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. జ్ఞానవాపి సర్వే రిపోర్ట్..

Gyanvapi: వారణాసి కోర్టుకు జ్ఞానవాపి సర్వే రిపోర్ట్.. నివేదికలోని కీలక పాయింట్స్ ఇవే..!
Gyanvapi
Shiva Prajapati
|

Updated on: May 19, 2022 | 1:05 PM

Share

Gyanvapi: జ్ఞానవాపి మసీదు, హిందూ టెంపుల్ వివాదం దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. జ్ఞానవాపి సర్వే రిపోర్ట్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందంటూ పలువురు వారణాసి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి సర్వే చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా అజయ్ మిశ్రా కమిటీ రెండు పేజీల నివేదికనుకోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మాజీ కోర్ట్ అడ్వోకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా సమర్పించిన నివేదిక వివరాలు.. గోడలపై హిందూ దేవతా మూర్తుల రూపాలు ఉన్నాయని పేర్కొన్నారు. శిలాఫలకాలపై సింధూరం రంగులో 4 దేవతా మూర్తులున్నాయన్నారు. వాయువ్య భాగంలో కొత్త నిర్మాణం చేయబడిందని, గోడలపై స్వస్తిక్ గుర్తులు ఉన్నాయన్నారు. అలాగే శేషనాగు చిహ్నాలు కూడా ఉన్నాయన్నారు. కొన్ని ఖండిత శిలలు ఉన్నాయని, ఈ శిలలు భగవాన్ శివుడివేనని అంచనా వేశారు. జ్ఞానవాపి మసీదులో సర్వే జరిపిన బాహ్య ప్రదేశంలో శృంగార్ గౌరీదేవీ మాతా మందిరం సంబందిత ఆనవాళ్లున్నాయని వెల్లడించారు. సర్వే జరిపిన లోపలి, బయట ప్రాంతాల్లో పురాతన చారిత్రక ఖండాల అవశేషాలున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

జ్ఞానవాపి పరిసరాలను రెండు భాగాలుగా భావిస్తే… వివాదాస్పద స్థలంలో బ్యారీకేడ్లు పెట్టిన బాహ్య ప్రాంతంలో శృంగార్ గౌరీదేవీ మందిరం ఆనవాళ్లు ఉన్నాయన్న నివేదికలో పేర్కొన్నారు. అయితే లోపలివైపు వెళ్లి సర్వే చేయడానికి అక్కడ ఉన్నవారికి కోర్టు ఆదేశాలు చూపించామని అప్పటికే సాయంత్రం కావడంతో అనాటి సర్వే ముగించామని వెల్లడించారు. శిలా నిర్మాణాలపై సిమెంట్‌తో నిర్మించిన కొత్త కట్టడాలు నిర్మించారని వెల్లడించారు. బాహ్య ప్రాంతంలో ఉన్న శిలాఖండితాలు లోపలవైపు కూడా కొనసాగుతున్నట్లు అంచనా వేశారు. వివాదాస్పద స్థలం లోపలి ప్రాంతంలోని మసీదు పశ్చిమ గోడ మధ్యలో సైతం దేవీ, దేవతామూర్తుల ఆనవాళ్లు ఉన్నాయని భావిస్తున్నామని నివేదికలో పేర్కొన్నారు పరిశీలకులు. అయితే.. 6, 7 తేదీల వరకే తన నివేదిక ఇచ్చారు అజయ్ మిశ్రా. అనంతరం తేదీల్లో జరిపిన సర్వేలో ఎటువంటి అంశాలు రాయలేదు. ఈ నివేదికలో వెల్లడించిన అంశాలన్నింటినీ వీడియో తీశామని అజయ్ మిశ్రా వెల్లడించారు.