Viral: సెలబ్రిటీలందు పాక్ సెలబ్రిటీలు వేరయా!.. ఆమె వెరీ గుడ్.. ఈమె వెరీ బ్యాడ్ అంటున్న నెటిజన్లు..!

Viral: క్రికెట్‌ బ్యాట్‌తో పాక్‌ మహిళా క్రికెటర్‌ కైనత్‌ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. అయితే కార్చిచ్చు బ్యాక్‌గ్రౌండ్‌తో పాక్‌ నటి హుమైరా

Viral: సెలబ్రిటీలందు పాక్ సెలబ్రిటీలు వేరయా!.. ఆమె వెరీ గుడ్.. ఈమె వెరీ బ్యాడ్ అంటున్న నెటిజన్లు..!
Pak
Follow us
Shiva Prajapati

|

Updated on: May 18, 2022 | 10:00 AM

Viral: క్రికెట్‌ బ్యాట్‌తో పాక్‌ మహిళా క్రికెటర్‌ కైనత్‌ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. అయితే కార్చిచ్చు బ్యాక్‌గ్రౌండ్‌తో పాక్‌ నటి హుమైరా అస్ఘర్‌ టిక్‌టాక్‌ వీడియోపై మాత్రం విమర్శలు వెలువెత్తాయి. పాకిస్తాన్ సెలబ్రిటీల తీరే వేరు. అంతర్జాతీయ మహిళా క్రికెటర్లలో బ్యూటీగా పేరున్న కైనత్‌ ఇంతియాజ్‌ వెడ్డింగ్‌ ఫోటో ఫూట్‌ను డిఫరెంట్‌గా చేసింది. బ్యాట్‌ పట్టుకొని క్రికెట్‌ ఆడుతూ ఆమె చేసిన వెడ్డింగ్‌ షూట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌‌ అవుతోంది. పెళ్లికూతురు క్రికెట్‌ ఆడుతూ ఇలా ఫోటో షూట్‌ చేయడం సంచలనం రేపింది. అభిమానులు కైనత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విరాట్‌ కోహ్లీని తన ఫేవరేట్‌ క్రికెటర్‌గా చెప్పుకున్నారు కైనత్‌ ఇంతియాజ్‌. గత మార్చి 30వ తేదీన మహ్మద్‌ వకార్‌ను పెళ్లి చేసుకుంది కైనత్‌. అయితే తన మ్యారేజ్‌ ఫోటో షూట్‌ను ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

కాగా, కైనత్‌ తన ఫోటో షూట్‌తో ఇలా మంచిపేరు సంపాదిస్తే మరో పాక్‌ సెలబ్రిటీ , నటి హుమైరా అస్ఘర్‌ చేసిన పనిపై విమర్శలు వెలువెత్తాయి. కార్చిచ్చు బ్యాక్‌ గ్రౌండ్‌గా అస్ఘర్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియోపై దుమారం చెలరేగుతోంది. హుమైరాకు సోషల్‌ మీడియాలో కోటి 20 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అగ్గి రాజుకుంటుంది అని టిక్‌టాక్‌ వీడియో తయారు చేశారు హుమైరా. కార్చిచ్చు బ్యాక్‌గ్రౌండ్‌గా ఆమె చేసిన టిక్‌టాక్‌ వీడియోపై వివాదం చెలరేగడంతో ఓ వివరణ ఇచ్చారు హుమైరా అస్ఘర్‌. కార్చిచ్చును తాను రాజేయలేదని స్పష్టం చేశారు. ఓవైపు పాకిస్తాన్‌ ప్రజలు 51 డిగ్రీల ఉష్ణోగ్రలతో అల్లాడిపోతుంటే ఈ పాడుపని ఏంటని చాలామంది పర్యావరణవేత్తలు ప్రశ్నించారు. కార్చిచ్చుపై ప్రజలు అప్రమత్తం చేయాల్సిన సెలబ్రిటీలు ఇలా ప్రవర్తించడం తప్పని అంటున్నారు. ఇది మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఇస్లామాబాద్‌ శివార్లలో అమె ఈ టిక్‌టాక్‌ వీడియోను చేసినట్టు తెలుస్తోంది‌.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!