Crime News: భార్యపైనే భర్త నిర్వాకం.. తుపాకీతో బెదిరిస్తూ అసహజ రీతిలో శృంగారం.. చివరకు..
గ్వాలియర్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ (బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్) కు స్థానికుడైన డాక్టర్‌తో 2020లో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్న డాక్టర్.. ఆ తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టాడు.
Gwalior Crime News: కలకాలం తోడుంటానని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యకు నరకం చూపించాడు.. అసహజ రీతిలో శృంగారం చేస్తూ ఆమెను నిత్యం వేధించేవాడు. నిరాకరిస్తే తుపాకీతో బెదిరించి తనను ఇబ్బందులకు గురిచేసేవాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి అత్తమామలు వంతపాడేవారని.. భర్త నుంచి రక్షించేందుకు నెలకు రూ.10 వేలు వసులు చేసేవారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. గ్వాలియర్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ (బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్) కు స్థానికుడైన డాక్టర్‌తో 2020లో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్న డాక్టర్.. ఆ తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టాడు. తనతో అసహజ శృంగారం చేయాలంటూ వేధించేవాడు. వద్దని ప్రతిఘటించిన ప్రతిసారీ ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించేవాడని.. కొట్టేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇదేకాకుండా రూ.10 లక్షలు తీసుకురావాలని వరకట్న వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. ఈ వేధింపులు నుంచి తనను కాపాడేందుకు అత్తమామలు తన దగ్గర నెలకు రూ.10వేల చొప్పున వసూలు చేసేవారంటూ ఆరోపించింది.
పెళ్లయినప్పటి నుంచి తన భర్త బలవంతంగా అసహజ లైంగిక సంబంధాలకు పాల్పడ్డాడని, దీంతో మానసికంగా కుంగిపోయానని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో మగబిడ్డకు జన్మనిచ్చినా.. అతని ప్రవర్తనలో మార్పురాలేదని పేర్కొంది. మహిళ శుక్రవారం ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిపై అసహజ సెక్స్, వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..