AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghulam Nabi Azad: ఇప్పటికీ విదేశీ పాలకులున్నారు.. మరో 10 రోజుల్లో పార్టీ ప్రకటిస్తానన్న ఆజాద్‌

Ghulam Nabi Azad New Party: జమ్ముకశ్మీర్‌ను మొఘలులు 800 ఏళ్లు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏళ్లు పాలించారని అయితే జమ్ము కశ్మీర్‌లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఇప్పటికీ ఉన్నారని

Ghulam Nabi Azad: ఇప్పటికీ విదేశీ పాలకులున్నారు.. మరో 10 రోజుల్లో పార్టీ ప్రకటిస్తానన్న ఆజాద్‌
Ghulam Nabi Azad
Sanjay Kasula
|

Updated on: Sep 11, 2022 | 3:53 PM

Share

ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన గులామ్‌ నబీ ఆజాద్‌ జమ్ము కశ్మీర్‌లో ర్యాలీలతో దూసుకుపోతున్నారు. బారాముల్లాలో ఈరోజు జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై మరింత దూకుడు పెంచారు. రాహుల్‌ గాంధీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. రాహుల్‌ టార్గెట్‌గా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. “నాపై క్షిపణులు ప్రయోగించారని.. కానీ తాను కేవలం 303 రైఫిల్‌తోనే వాటిని ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకున్నానన్నారు. అదే నేను బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగిస్తే..వారు మాయమైపోయేవారంటూ ఘాటుగా రియాక్టయ్యారు ఆజాద్‌. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. గత మూడేళ్లలో జమ్ముకశ్మీర్‌లో అనేక విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలాగే కశ్మీర్ కూడా ఆక్రమణదారులచే నాశనం చేయబడిందన్నారు.

గులాబ్ నబీ ఆజాద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ను మొఘలులు 800 ఏళ్లు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏళ్లు పాలించారని అయితే జమ్ము కశ్మీర్‌లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఇప్పటికీ ఉన్నారని స్థానిక ప్రాంతాయ పార్టీలను టార్గెట్ చేశారు. అందరూ జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత అది అంతర్గత రాజకీయాల బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘జమ్ముకశ్మీర్ ప్రజలకు అన్యాయం జరుగుతోంది’

ఆజాద్ మూడు రోజుల పాటు 300 మందికి పైగా ప్రతినిధులను కలిశారు. శనివారం ఉదయం దోడా చేరుకున్న ఆయనకు మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. దోడాలో జమ్మూ ప్రజల హక్కుల కోసం తాను గళం విప్పుతానని అక్కడివారికి హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, దానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తామని అన్నారు.

‘జమ్ముకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తాం’

శుక్రవారం కిష్త్వార్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రతిపాదిత కొత్త పార్టీ ఎజెండాను అందరి ముందు ఉంచారు.  జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై తాను పోరాడతానని వెల్లడించారు.  తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇప్పటి వరకు పేరును నిర్ణయంచలేదని, జమ్ము కశ్మీర్‌ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, జమ్ముకశ్మీర్‌లోని అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడివారి అభిప్రాయాలను తెలుసుకుంటూ, ప్రజల సమస్యలను వింటున్నానని అన్నారు.

ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పార్టీ పేరును ప్రకటిస్తాన్నారు. జమ్ముకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంతోపాటు స్థానిక ప్రజల ఉద్యోగ, భూమి హక్కులను కాపాడాలన్న కొత్త పార్టీ ఎజెండా విషయంలో పరిస్థితి స్పష్టంగా ఉందని ఆజాద్ స్పష్టంచేశారు. ఇక గులాంనబీ ఆజాద్‌కు మద్దతుగా దాదాపు 100 మంది కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఆజాద్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం