Gujarat Elections: గుజరాత్‌లో ఆ పార్టీల మధ్యే పోటీ.. ముగిసిన రెండో విడత ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే..?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ ముగియగా.. సోమవారం రెండో విడత ఎన్నికలు ముగిశాయి. 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Gujarat Elections: గుజరాత్‌లో ఆ పార్టీల మధ్యే పోటీ.. ముగిసిన రెండో విడత ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే..?
Gujarat Election 2022
Follow us

|

Updated on: Dec 05, 2022 | 6:08 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ ముగియగా.. సోమవారం సాయంత్ర రెండో విడత పోలింగ్ పూర్తియింది. 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్ రెండో దశ ఎన్నికలు 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు జనం భారీగా క్యూ కట్టారు. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు సగటున 60 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు పోలింగ్ బూత్‌ల భారీ క్యూలు కనిపించాయి. రెండవ దశలో 93 నియోజకవర్గాల నుంచి బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్ శాతం గురించి ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి.. మొదటి విడతలో 89 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. 93 స్థానాల్లో ఈ రోజు పోలింగ్‌ పూర్తికాగా.. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా.. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం సొంతంచేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. బీజేపీ పాలనకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, ఆప్ ప్రయత్నించాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..