Lok Sabha Election: తూచ్.. మేం పెట్టలే.. కాంగ్రెస్ అభ్యర్థి కొంపముంచిన సంతకాలు.. నామినేషన్ తిరస్కరణ

గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూరత్‌లోని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ పత్రాలు తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అతని నామినేషన్ ఫారమ్‌పై ముగ్గురు ప్రతిపాదకులు సంతకం చేయలేదని జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Lok Sabha Election: తూచ్.. మేం పెట్టలే.. కాంగ్రెస్ అభ్యర్థి కొంపముంచిన సంతకాలు.. నామినేషన్ తిరస్కరణ
Nilesh Kumbhani
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 21, 2024 | 3:42 PM

గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూరత్‌లోని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ పత్రాలు తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అతని నామినేషన్ ఫారమ్‌పై ముగ్గురు ప్రతిపాదకులు సంతకం చేయలేదని జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే నీలేష్ నామినేషన్ రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్ పార్ధి ప్రకటించారు. దీంతో సూరత్ సీటుపై హై ఓల్టేజీ డ్రామా మొదలైంది. అయితే, కలెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ తర్వాత, హై ఓల్టేజ్ డ్రామాకు తెరపడింది.

సూరత్ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ ఫారమ్‌ దాఖలు చేశారు. అందులో ముగ్గురు ప్రతిపాదిత అభ్యర్థులతో సంతకాలు చేశారు. అయితే నామనేషన్ పత్రాల్లో పేర్కొన్న సంతకాలు తమవి కావంటూ జిల్లా ఎన్నికల అధికారికి మరో అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో ఫారమ్ నింపిన మూడు రోజుల తర్వాత హై వోల్టేజ్ డ్రామా కొనసాగింది. ఆ ముగ్గురిని తమ ముందు హాజరు పర్చాలంటూ అభ్యర్థి నీలేష్‌కు సూచించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. అయితే ఫారమ్ వెరిఫికేషన్ సమయంలో సంతకాలు చేసిన వ్యక్తులనున కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సౌరభ్ పార్ధి ప్రకటించారు.

ఇదిలావుంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని ప్రతిపాదకులుగా అతని బావమరిది జగదీష్ సవాలియా, అతని మేనల్లుడు ధృవిన్ ధమేలియా, భాగస్వామి రమేష్ పొల్లారా అభ్యర్థనను కూడా ఎన్నికల అధికారి వీడియో రికార్డింగ్ చేశారు. ప్రతిపాదకుల వాదనను అనుసరించి, ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీకి సమాధానం ఇవ్వడానికి ఒక రోజు సమయం ఇచ్చారు. ఎన్నికల అధికారికి సమాధానమివ్వడానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ తన న్యాయవాదితో వచ్చారు. అయితే ముగ్గురు ప్రతిపాదకులలో ఒక్కరు కూడా హాజరుకాలేదు. కాగా, దేశ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. సూరత్ లోక్‌సభ స్థానం 1989 నుంచి బీజేపీ ఆధీనంలో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..