AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా ఐసిస్ విధ్వంస రచన.. ఆయుధాలు, విషపూరిత పదార్థాలు సీజ్‌.. పట్టుబడిన వారిలో హైదరాబాదీ!

మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధ్వంసానికి స్కెచ్‌ వేసి, దాడులకు సమాయత్తమైన ఐసిస్ ముఠాను అరెస్ట్ చేసింది గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌. దాడులకోసం ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారన్న సందేహంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది ATS.

దేశవ్యాప్తంగా ఐసిస్ విధ్వంస రచన.. ఆయుధాలు, విషపూరిత పదార్థాలు సీజ్‌.. పట్టుబడిన వారిలో హైదరాబాదీ!
Gujarat Ats Foils Major Terror Plot
Balaraju Goud
|

Updated on: Nov 09, 2025 | 4:34 PM

Share

మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధ్వంసానికి స్కెచ్‌ వేసి, దాడులకు సమాయత్తమైన ఐసిస్ ముఠాను అరెస్ట్ చేసింది గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌. దాడులకోసం ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారన్న సందేహంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది ATS. పట్టుబడ్డవారిలో డాక్టర్ అహ్మద్, సుహైల్, అజార్ సైఫీ ఉన్నారు. ఒకరు హైదరాబాద్‌ వాసి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది నుంచి నిఘా ఉంచి, ఆయుధాల తయారీ, సరఫరాకు సంబంధించిన ఆధారాలు సేకరించి డైరెక్ట్‌ యాక్షన్‌లోకి దిగారు ATS అధికారులు. కొన్ని ఆయుధాలను, విషపూరిత పదార్థాలను కూడా సీజ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఐదుగురు అల్‌-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేశారు ఏటీఎస్‌ అధికారులు. పాక్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఓ మహిళ కూడా ఈ టీమ్‌లో ఉంది. ఇవాళ అరెస్టయిన వారు ముగ్గురూ రెండు టెర్రరిస్ట్ మాడ్యూల్స్‌కి పని చేస్తున్నట్టు తేలింది. ఎక్కడెక్కడ దాడులకు, పేలుళ్లకు ప్లాన్ చేశారు? వాళ్లకు ఆసరా ఇస్తున్నది ఎవరు? లాంటి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉంది ఏటీఎస్.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us