JEE Main 2026 Preparation Apps: జేఈఈ మెయిన్ సన్నద్ధతకు బెస్ట్ ఆన్‌లైన్ యాప్స్.. మరింత స్మార్ట్‌గా చదివేద్దామా?
Best Online apps for JEE Main 2026 prepration: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు పరీక్షలు జనవరి 21 నుంచి 30 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీయే షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే సొంతంగా ఇంట్లోనే ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్ధులు ఒత్తిడితో చిత్తవకుండా ఈ కింది స్మార్ట్ టిప్స్ ఫాలో అయితే తొలి ప్రయత్నంలోనే..

హైదరాబాద్, నవంబర్ 9: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు పరీక్షలు జనవరి 21 నుంచి 30 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీయే షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే సొంతంగా ఇంట్లోనే ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్ధులు ఒత్తిడితో చిత్తవకుండా ఈ కింది స్మార్ట్ టిప్స్ ఫాలో అయితే తొలి ప్రయత్నంలోనే జేఈఈ మెయిన్ క్రాక్ చేయవచ్చు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్‌తోపాటు ఈ కింది ముఖ్యమైన యాప్స్ మీ ప్రిపరేషన్ జర్నీని మరింత సులభతరం చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఎన్‌టీ అభ్యాస్ (NT Abhyas)
జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి మాక్ టెస్ట్‌లందించేందుకు ఈ యాప్‌ను ఎన్‌టీఏ అందుబాటులోకి తెచ్చింది. జేఈఈ అభ్యర్ధులకు ఇందులో ఉచితంగా డైలీ మాక్‌టెస్టులు ఉంటాయి. ప్రతి మాక్ టెస్టులో వివరణాత్మకంగా సొల్యూషన్లు కూడా ఉంటాయి. అలాగే పెర్ఫామెన్స్ అనాలసిస్ కూడా ఉంటుంది. ఏ సమయంలోనైనా నేర్చుకొనేందుకు వీలుగా ఆఫ్‌లైన్ యాక్సెస్ కూడా ఈ యాప్‌లో ఉంది.
మెల్‌వానో (Melvano) యాప్
ఇందులో విద్యార్థులు ఏ అంశంలో వీక్‌గా ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి గుర్తించే వీలుంటుంది. ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్‌లు, 45 ఏళ్ల పాత ప్రశ్నలు సైతం ఇందులో అందుబాటులో ఉంటాయి.
స్వయం (SWAYAM) యాప్
దేశంలోని ప్రముఖ ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రొఫెసర్ల వీడియో లెక్చర్లు ఇందులో ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో కాన్సెప్టులను నేర్చుకొనేందుకు ఇది ఎంతో సహకరిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




