Gujarat Election: గుజరాత్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని మోడీ
గుజరాత్‌లో రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్దమయ్యింది. తొలిదశలో 89 స్థానాలకు ఎన్నికలు పూర్తవగా.. సోమవారం 93 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.

గుజరాత్‌లో సోమవారం తుదిదశ పోలింగ్ జరుగుతుంది. 93 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. రాజ్‌భవన్ లోనే ఆయన బస చేస్తున్నారు. రేపు అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు మోదీ. గుజరాత్‌లో రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్దమయ్యింది. తొలిదశలో 89 స్థానాలకు ఎన్నికలు పూర్తవగా.. సోమవారం 93 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్‌తో సహా పలు పట్టణ ప్రాంతాల్లో సోమవారం పోలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ్ కంటే ముందు ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. తన తల్లి హీరాబెన్‌ను కలిశారు మోదీ. ఈరోజు రాత్రి గుజరాత్ రాజ్‌భవన్‌లో ఉంటారు ప్రధాని. రేపు అహ్మదాబాద్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్‌షా ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేశారు. గుజరాత్‌లో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోకపోతే ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై పడుతుందని భావిస్తున్న బీజేపీ.. తీవ్రంగా పోరాడుతోంది. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. ఇందులో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా..దానికి అడ్డుకట్టే వేసేందుకు కాంగ్రెస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయి.




#WATCH | Gujarat: Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/C4uh1CMOFb
— ANI (@ANI) December 4, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
