Delhi: ముగిసిన ఎన్నికలు.. ఢిల్లీని చెత్తనగరంగా మార్చిన మూర్ఖులకు గుణపాఠం తప్పదు: కేజ్రీవాల్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గెలుపుపై అటు బీజేపీ , ఇటు ఆప్ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే ఓటింగ్ శాతం తగ్గడంతో రెండు పార్టీలో కూడా..

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గెలుపుపై అటు బీజేపీ , ఇటు ఆప్ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే ఓటింగ్ శాతం తగ్గడంతో రెండు పార్టీలో కూడా టెన్షన్ నెలకొంది. ఢిల్లీలో జరిగిన గల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉంది. 250 సీట్ల కోసం 1349 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన కుటుంబ సమేతంగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోంచుకున్నారు.
ఢిల్లీని చెత్తనగరంగా మార్చిన మూర్ఖులకు గుణపాఠం తప్పదన్నారు కేజ్రీవాల్. హస్తినను గ్రీన్ సిటీగా మార్చే పార్టీకే పట్టం కట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై అటు బీజేపీ .. ఇటు ఆమ్‌ఆద్మీ పార్టీ ధీమాతో ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని ఆధిక్యత ఉంది. ఈసారి బీజేపీకి షాక్ ఇస్తామని ఆప్ నేతలంటున్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది. ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు ఢిల్లీ పీసీసీ చీఫ్ అనిల్ చౌదరి. తన ఓటు గల్లంతు కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది సామాన్యుల ఓట్లు కూడా గల్లంతు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని అటు ఆప్, ఇటు బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు.



మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
