PM Narendra Modi: గుజరాత్‌‌లో తల్లి హీరాబెన్‌ను కలిసిన ప్రధాని మోదీ.. పోలింగ్ వేళ ఆశీర్వాదం తీసుకుని..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ(రెండవ దశ) ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు

PM Narendra Modi: గుజరాత్‌‌లో తల్లి హీరాబెన్‌ను కలిసిన ప్రధాని మోదీ.. పోలింగ్ వేళ ఆశీర్వాదం తీసుకుని..
Pm Modi
Follow us

|

Updated on: Dec 04, 2022 | 6:55 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ(రెండవ దశ) ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు గాంధీనగర్‌లోని తల్లి హీరాబెన్‌ నివాసానికి వెళ్లారు. మాతృమూర్తితో కాసేపు ముచ్చటించిన తరువాత ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు తల్లి సేవలో ఉన్న ప్రధాని మోదీ.. ఆమె పాదాలు కడిగి, మిఠాయిలు తినిపించాడు. ఎన్నికల్లో గెలుపొందేలా ఆశీర్వించాలని కోరారు. సోమవారం నాడు జరుగనున్న తుది దశ పోలింగ్‌లో అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీకి అహ్మదాబాద్‌లోని సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అందులో భాగంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని మోదీ.

డిసెంబర్5న గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ గాంధీనగర్ వచ్చారు. అయితే, ప్రతీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈసారి కూడా అలాగే తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆగస్టు నెలలో కూడా ప్రధాని మోదీ తల్లిని కలుసుకున్నారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన ప్రారంభోత్సవం, ఖాదీ పండుగ సందర్భంగా గుజరాత్ వచ్చిన ఆయన.. తన తల్లి ఇంటికి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

పోలింగ్ 8 గంటలకు ప్రారంభం..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. సోమవారం నాడు పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. గుజరాత్‌లోని 93 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఇక డిసెంబర్ 1న 89 స్థానాలకు తొలిదశ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. రేపటి పోలింగ్‌లో గుజరాత్‌లో మొత్తం 2.54 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికలు జరుగనున్న 93 నియోజకవర్గాల్లో 26,409 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 36,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించనున్నారు.

తల్లి హీరాబెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..